For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

51,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్, 2021లో డిజిటల్ కాయిన్ 76% జంప్

|

క్రిప్టో కరెన్సీ పరుగు తీసింది. ఈ వారం ఓ సమయంలో 46,000 డాలర్లకు పడిపోయిన క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఇప్పుడు ఏకంగా 51,000 డాలర్లు క్రాస్ చేసింది. చాలా రోజుల తర్వాత క్రిప్టో మార్కెట్ భారీగా పరుగు పెట్టింది. ప్రధానంగా బిట్ కాయిన్, ఎథేరియం ఎగిసిపడటం క్రిప్టో మార్కెట్ భారీగా పెరగడానికి కారణమైంది. 2022 ఆంగ్ల నూతన సంవత్సరానికి ముందు ఇన్వెస్టర్లను బిట్ కాయిన్ మురిపించింది. ప్రస్తుతం బిట్ కాయిన్ వ్యాల్యూ 51,050 డాలర్ల వద్ద ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో 5.50 శాతం లాభపడింది. బిట్ కాయిన్ వారం రోజుల్లో 8.34 శాతం ఎగిసింది. మార్కెట్‌లో బిట్ కాయిన్ వాటా 40.50 శాతంగా ఉంది. క్రితం సెషన్‌తో ఇది 0.18 శాతం అధికం. బిట్ కాయిన్ 53,000 డాలర్లు, 55,000 డాలర్ల మధ్య బలమైన పరీక్షను ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు.

రెండో క్రిప్టో దిగ్గజం ఎథేరియం 4000 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. ఎథేరియం 4,097 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల్లో 3.99శాతం, వారం రోజుల్లో 6.88 శాతం లాభపడింది. ఇతర క్రిప్టోలు కూడా భారీగానే లాభపడ్డాయి. టెథేర్, సోలానా, బియాన్స్ కాయిన్, ఎక్స్‌పీఆర్, కార్డానో, మెముకాయిన్స్ షిబా ఇను, డోజీకాయిన్ కూడా లాభపడ్డాయి. కార్డానో 10 శాతం మేర, టెర్రా దాదాపు పదిహేను శాతం లాభపడ్డాయి. అవాలాంచే మాత్రం నష్టపోయింది.

Crypto prices today: Bitcoin, Terra and Cardano zoom up to 15%

2021లో డిజిటల్ కాయిన్స్ ఏకంగా 76 శాతం లాభపడ్డాయి. వరుసగా మూడో సంవత్సరం లాభపడ్డాయి.

గత 24 గంటల్లో భారీగా లాభపడిన 6 క్రిప్టో కరెన్సీల్లో.. నియర్‌ప్యాడ్ 162 శాతం, షిబ్RWD 161 శాతం, టిటైనా 109 శాతం, కేక్ స్వాప్ 109 శాతం, పారెలల్ ప్రోటోకాల్ 107 శాతం, సన్ ఆఫ్ ఎలాన్ 102 శాతం లాభపడ్డాయి.
గత 24 గంటల్లో భారీగా నష్టపోయిన ఆరు క్రిప్టోల్లో డాపిల్ ఫైనాన్స్ 99.92 శాతం, పఫ్ శాంటా 96 శాతం, రోనిన్ గేమ్జ్ 84 శాతం, స్పిరిట్DAO ఘోస్ట్ 76 శాతం, కేక్DAO 75 శాతం, APIDAI 74 శాతం నష్టపోయాయి.

English summary

51,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్, 2021లో డిజిటల్ కాయిన్ 76% జంప్ | Crypto prices today: Bitcoin, Terra and Cardano zoom up to 15%

Bitcoin price today: Cryptocurrency rose to about $51,000 and touched the highest level in more than two weeks, buoyed by wider positive sentiment in financial markets.
Story first published: Friday, December 24, 2021, 22:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X