For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 వారాల్లో మొదటిసారి.. 60,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్

|

వరుసగా ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ భారీగా నష్టపోతోంది. బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టోలు ఇటీవల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ రెండు వారాల తర్వాత మొదటిసారి 60,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ పాపులర్ క్రిప్టో కరెన్సీ 1.73 శాతం క్షీణించి 59,602 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.12 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 2.31 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 3.28 శాతం క్షీణించి 4,174 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. చాలా క్రిప్టోల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించిందని, బిట్ కాయిన్ 58,000 దిశగా సాగవచ్చునని క్రిప్టో మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే బిట్ కాయిన్‌కు 57,000 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉందని చెబుతున్నారు.

 Crypto prices today: Bitcoin falls below $60,000 for 1st time in 2 weeks

వార్త రాసే సమయానికి వివిధ క్రిప్టోల ధరలు..

- Bitcoin - 59,588.95 డాలర్లు - 1.86% క్షీణత

- Ether - 4,173.34 డాలర్లు - 3.76% క్షీణత

- Dogecoin - 0.235275 డాలర్లు - 5.03% క్షీణత

- Litecoin - 224.31 డాలర్లు - 8.92% క్షీణత

- XRP - 1.08 డాలర్లు - 3.93% క్షీణత

- Cardano - 1.83 డాలర్లు - 5.68% క్షీణత

English summary

2 వారాల్లో మొదటిసారి.. 60,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ | Crypto prices today: Bitcoin falls below $60,000 for 1st time in 2 weeks

Cryptocurrency prices fell further over the past 24 hours due to continued profit booking by investors.
Story first published: Wednesday, November 17, 2021, 21:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X