For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto prices: భారీగా పడిపోయిన బిట్ కాయిన్, ఎథేరియం

|

క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు (సెప్టెంబర్ 28, మంగళవారం) భారీగా క్షీణించింది. నేడు దాదాపు నాలుగు శాతం క్షీణించిన బిట్ కాయిన్ 42,500 దిగువకు పడిపోయింది. ప్రపంచ దిగ్గజ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది (ఇయర్ టు డేట్) 45 శాతం పెరిగింది. సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో, ఎథేరియం బ్లాక్ చైన్ లింక్డ్ కాయిన్ ఎథేర్ ఏడు శాతం మేర క్షీణించి 2,956.8 డాలర్లకు పడిపోయింది.

కార్డానో 4 శాతం క్షీణించి 2.16 డాలర్లకు, డోజీకాయిన్ 3 శాతం పడిపోయి 0.20 డాలర్లకు తగ్గింది. ఎక్స్‌పీఆర్, లైట్ కాయిన్, స్టెల్లార్, సోలానా వంటివి కూడా తగ్గాయి. సెప్టెంబర్ ప్రారంభం నుండి ఎథేరియం క్షీణిస్తోంది. క్రిప్టో మార్కెట్ నిపుణులు ఎథేరియం మద్దతు ధర 2600 డాలర్ల వద్ద అంచనా వేస్తున్నారు.

Crypto prices today: Bitcoin, ether, dogecoin, other crypto prices fall

బిట్ కాయిన్ మార్కెట్ వాటా 42 శాతం కంటే పైగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమైంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. గతవారం తిరిగి 47వేల డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత 45,000 డాలర్ల దిగువకు పడిపోయింది.

English summary

Crypto prices: భారీగా పడిపోయిన బిట్ కాయిన్, ఎథేరియం | Crypto prices today: Bitcoin, ether, dogecoin, other crypto prices fall

The largest virtual currency Bitcoin was trading in the green on Monday, it was up 4.72 per cent at $44,045.69, the market cap of the Bitcoin stood at $828.90 billion.
Story first published: Tuesday, September 28, 2021, 21:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X