For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొద్దివారాల్లోనే 90,000 డాలర్లకు బిట్ కాయిన్: వివిధ క్రిప్టో వ్యాల్యూ

|

బిట్ కాయిన్ నేడు (నవంబర్ 12) నేడు క్షీణించింది. నేటి ప్రారంభ సెషన్లో 65,000 డాలర్ల మార్కు దాటి దూసుకెళ్లినప్పటికీ, మిడిల్ సెషన్ నుండి నష్టాల్లోకి జారిపోయింది. రెండు శాతానికి పైగా నష్టపోయింది. వరల్డ్ లార్జెస్ట్ క్రిప్టో అయిన బిట్ కాయిన్ మార్కెట్ వ్యాల్యూ ఈ ఏడాదిలో (2021 క్యాలెండర్ ఇయర్) 125 శాతం పెరిగింది. ప్రారంభ సెషన్‌లో0.8 శాతం లాభపడి 65,244 డాలర్ల వద్ద ట్రేడ్ అయినప్పటికీ, ఆ తర్వాత 63,327.50 డాలర్లకు పడిపోయింది. అంటే దాదాపు 2000 డాలర్ల వరకు క్షీణించింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే మాత్రం 1500 డాలర్ల మేర క్షీణించింది.

నేటి ప్రారంభ సెషన్‌లో సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో ఎథేరియం 3% శాతం లాభపడి 4801 వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం ఆల్ టైమ్ గరిష్టం వద్ద ట్రేడ్ అయింది. డోజీకాయిన్ 2 శాతం మేర పెరిగి 0.25 డాలర్ల వద్ద, షిబా ఇను 8 శాతం లాభపడి 0.000054 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. లైట్ కాయిన్, ఎక్స్‌పీఆర్, పోల్కాడాట్, యూనిస్వాప్, స్టెల్లార్ కూడా లాభాల్లోనే ఉన్నాయి. సోలానా, కార్డానో మాత్రం క్షీణించాయి. షిబా ఇను 11 శాతం క్షీణించింది. బిట్ కాయిన్ జూన్ నెలలో 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ 65,000 డాలర్లను దాటింది.

crypto prices today: Bitcoin due to hit $90K in coming weeks

రానున్న రోజుల్లో బిట్ కాయిన్ 90,000 డాలర్లు క్రాస్ చేస్తుందని క్రిప్టో మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్ కాయిన్ బుధవారం ఒక్కరోజే 67,000 డాలర్లు దాటినప్పటికీ, 4వేల డాలర్ల వరకు క్షీణించి 63,000 డాలర్ల దిగువన ముగిసింది. ఆ తర్వాత దాదాపు స్థిరంగా ఉంది. అయితే వచ్చే కొద్ది వారాల్లో బిట్ కాయిన్ 85,000 డాలర్ల నుండి 90,000 డాలర్లకు చేరుకునే అవకాశముందని అంటున్నారు.

మన కరెన్సీలో వివిధ క్రిప్టో వ్యాల్యూ

- Bitcoin - రూ.52,38,577
- Ethereum - రూ.3,83,301
- Tether - రూ.80.09
- Cardano - రూ.167.9519
- Binance Coin - రూ.50,647.7
- XRP - రూ.98.1686
- Polkadot - రూ.3,807
- Dogecoin - రూ.21.21

English summary

కొద్దివారాల్లోనే 90,000 డాలర్లకు బిట్ కాయిన్: వివిధ క్రిప్టో వ్యాల్యూ | crypto prices today: Bitcoin due to hit $90K in coming weeks

Bitcoin is still on to run to $90,000 in the coming weeks after “trapping” leverage traders.
Story first published: Friday, November 12, 2021, 22:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X