For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

48,000 మార్కును క్రాస్ చేసిన బిట్ కాయిన్, ఎథేరియం 4% జంప్

|

క్రిప్టోకరెన్సీ ధరలు లాభాల్లో ఉన్నాయి. అయినప్పటికీ గ్లోబల్ క్రిప్టో కెరన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.157.19 కోట్లుగా నమోదయింది. మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత ఇరవై నాలుగు గంటల్లో రూ.7,24,397 కోట్లు. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 48,000 డాలర్లను క్రాస్ చేసింది. ఆ తర్వాత క్షీణించినప్పటికీ మొత్తానికి రూ.47,000 డాలర్లకు పైనే ఉంది. ఎథేరియం 2.19 శాతం, కార్డానో 0.25 శాతం లాభపడింది.

బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 899.94 బిలియన్ డాలర్లుగా ఉంది. గతవారం రోజుల్లో బిట్ కాయిన్ 11.34 శాతం లాభపడింది. క్రిప్టో కరెన్సీ పైన చైనా కఠిన ఆంక్షల నేపథ్యంలో ఇటీవల క్రిప్టో మార్కెట్ పతనమైంది. దీంతో బిట్ కాయిన్ 41వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ.. ఇప్పుడు 48,000 స్థాయికి చేరుకుంది.

ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఇటీవల ఊగిసలాటలో ఉంది. బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మాత్రం మే నెల తర్వాత గత నెలలో నమోదయింది. బిట్ కాయిన్ మార్కెట్ వాటా దాదాపు యాభై శాతంగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది.

Crypto News: Ethereum up by nearly 4 percent

మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమైంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలో 44,000 డాలర్లకు పడిపోయింది. ఇలా ఊగిసలాటలో కొనసాగుతూ నేడు 47వేల డాలర్ల పైకి చేరుకుంది.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

బిట్ కాయిన్ - $ 48,102.46 - 24 గంటల్లో 0.67 జంప్.

ఎథేర్ - $3,360.66 - 24 గంటల్లో 2.19 జంప్.

కార్డానో - $2.23 - 24 గంటల్లో 0.625 జంప్.

బియాన్స్ కాయిన్ - $424.79 - 24 గంటల్లో 1.66 జంప్.

XRP - 0.9802 - 24 గంటల్లో 8.18 డౌన్.

సోలానా - 167.93 - 24 గంటల్లో 4.55 జంప్.

పోల్కాడాట్ - $31.48 - 24 గంటల్లో 2.73 డౌన్.

డోజీకాయిన్ - $0.2167 - 24 గంటల్లో 2.55 డౌన్.

English summary

48,000 మార్కును క్రాస్ చేసిన బిట్ కాయిన్, ఎథేరియం 4% జంప్ | Crypto News: Ethereum up by nearly 4 percent

Bitcoin's price is currently Rs 36,69,001 and its dominance is currently 42.27 percent, a decrease of 0.65 percent over the day.
Story first published: Sunday, October 3, 2021, 16:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X