For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా ధరలు పెరగవ్: జీడీపీ సహా.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ గవర్నర్

|

రుణాల వృద్ధి పెరుగుతూనే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేస్తున్నారు. అలాగే, బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ద్రవ్యోల్భణం పెరగదన్నారు. భారత రుణ వ్యవస్థ బలపడిందని చెప్పారు. శనివారం ఆర్బీఐ కేంద్ర బోర్డు 582వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శక్తికాంత దాస్ మాట్లాడారు.

కస్టమర్లపై ATM విత్‌డ్రా మరింత భారం... ఎక్కడ ఎంత పెరగవచ్చు?

డిమాండ్ పెరిగి, జీడీపీ పుంజుకునే ఛాన్స్

డిమాండ్ పెరిగి, జీడీపీ పుంజుకునే ఛాన్స్

మన రుణ వ్యవస్థ బలపడిందని శక్తికాంతదాస్ అన్నారు. ప్రయివేట్ రంగానికి నిధుల కొరత రాకుండా బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పెరిగాయన్నారు. రుణాల మంజూరు పెరిగితే వినియోగదారుల వద్ద నగదు పెరుగుతుందని, దీంతో మార్కెట్లో డిమాండ్‌ ఊపందుకుని, జీడీపీ పుంజుకునే వీలు ఉందని చెప్పారు.

అప్పుడు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది

అప్పుడు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది

వడ్డీ రేట్ల కోత ప్రయోజనం కూడా పూర్తిగా అందినట్లయితే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు శక్తికాంత దాస్. ద్రవ్యోల్బణం పైన బడ్జెట్‌ ప్రభావం పెద్దగా ఉండబోదన్నారు. అందుకే ధరలు పెరగక పోవచ్చునని చెప్పారు. మార్కెట్లో దిగి వస్తున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణం కట్టడికి కలిసి వస్తాయన్నారు. ముడి చమురు ధరలు తగ్గుతుండటం కలిసి వచ్చే అంశమన్నారు. ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (FRBM) చట్టంలోని ఎస్కేప్ క్లాజ్‌ను కేంద్రం వాడుకుంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఒత్తిడి ఉన్నప్పుడు ద్రవ్యలోటు లక్ష్యాన్ని 0.5 శాతం సవరించేందుకు కేంద్రానికి వెసులుబాటు కలిగిస్తుందన్నారు.

వృద్ధి రేటులో వేగం పెరుగుతోంది..

వృద్ధి రేటులో వేగం పెరుగుతోంది..

వృద్ధి రేటులో వేగం పెరుగుతోందని, రాబోయే కొద్ది రోజుల్లో రేట్ల కోతల బదలీ మరింతగా మెరుగుపడుతుందని భావిస్తున్నామని శక్తికాంత దాస్ అన్నారు. బదలీ ఆగిందని మాత్రం తాము అనుకోవడం లేదని, నెమ్మదిగానైనా స్థిరంగా జరుగుతుందన్నారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సంవత్సరమే..

ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సంవత్సరమే..

ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సంవత్సరాన్నే ఆర్బీఐ పాటించాలని బోర్డు సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏప్రిల్-మార్చి కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తుండగా, ఆర్బీఐ జూలై-జూన్‌ కాలాన్ని పాటిస్తోంది. వచ్చే ఏడాది 2020-21 నుండి దీనిని అనుసరించాలని ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సూచించారు. దీనిని ఆమోదించిన బోర్డు ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తుంది.

టెలికం కంపెనీలు మూతబడితే...

టెలికం కంపెనీలు మూతబడితే...

AGR బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశాలపై కూడా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా చర్చిస్తామని చెప్పారు. టెలికం సంస్థలు మూతబడితే బ్యాంకర్ల మొండి బకాయిలు పెరగవచ్చుననే ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ పైవిధంగా స్పందించారు. కాగా, టెలికం కంపెనీలు ఏవైనా దివాలాకు దరఖాస్తు చేసుకుంటే ఆ మూల్యం బ్యాంకులు చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అంచనా వేశారు. టెలికం కంపెనీలు రూ.1.47 లక్షల కోట్లు మార్చి 17 కల్లా కట్టాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.

English summary

Credit growth momentum picking up: RBI governor

Amid concerns over economic slowdown, RBI chief Shaktikanta Das on Saturday said credit growth momentum is picking up and ruled out any possible spike in inflation due to Budget proposals as the government is maintaining fiscal prudence.
Story first published: Sunday, February 16, 2020, 11:44 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more