For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Income Tax: క్రెడిట్ కార్డ్ తెగ వాడేస్తున్నారా..? అయితే ఆదాయపుపన్ను నోటీసులొస్తాయ్..! జాగ్రత్త

|

Credit Card: డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సైతం వినియోగదారులను ఆకర్షించేందుకు మంచి ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అయితే ఇలా కార్డు ద్వారా చేస్తున్న ఖర్చులపై ఆదాయపు పన్ను చెల్లించాలా అనే అనుమానం మనలో చాలా మందికి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐటీ లక్ష్మణ రేఖ..

ఐటీ లక్ష్మణ రేఖ..

క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేస్తూ నెలవారీ జీతం రాగానే బిల్లును తిరిగి చెల్లించే వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు ఖర్చు చేయటంపై కూడా ఓ కన్నేసి ఉంచుతుందని వినియోగదారులు గమనించాలి. ఇలా ఎంత ఖర్చు చేయవచ్చనే దానిపై ఐటీ శాఖ లక్ష్మణ రేఖను గీసింది. ఆ పరిమితులను దాటి ఖర్చు చేస్తే ఐటీ అధికారుల నుంచి కచ్చితంగా నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది.

 పెరిగిన వినియోగం..

పెరిగిన వినియోగం..

రిజర్వ్ బ్యాంక్ డేటా ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ల సంఖ్య 2022లో 3.7 శాతం పెరిగింది. అంటే దాదాపుగా నాలుగు రెట్లు పెరిగింది. ఇది మాత్రమే కాక POS వద్ద క్రెడిట్ కార్డులను వినియోగించే వారి సంఖ్య కూడా 1.2 శాతం పెరిగింది. అయితే నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఖర్చయితే ఆదాయపు పన్ను శాఖకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి.

ఎక్కువ ఖర్చు చేస్తుంటే..

ఎక్కువ ఖర్చు చేస్తుంటే..

క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ స్పెషల్ నిబంధనలను కలిగి లేనప్పటికీ.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అదనపు లావాదేవీలను నివేదించాలి. పన్ను నిబంధనల ప్రకారం బ్యాంకులు ఫారం 61A ద్వారా రూ.10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలను ఆర్థిక సంస్థలు నివేధించాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తుల క్రెడిట్ కార్డ్ ఖర్చుల సమాచారాన్ని ఫారం 26A ద్వారా బ్యాంకులకు అందించాలి.

 టాక్స్ రూల్స్ ప్రకారం..

టాక్స్ రూల్స్ ప్రకారం..

ఒక క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు ఎంత డబ్బు వెచ్చించవచ్చో కూడా ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అంతకు మించి డబ్బు ఖర్చు చేస్తే ఆదాయపన్ను శాఖ అతనిపై కన్నేస్తుంది. ప్రతి నెలా రూ. లక్ష కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లులను ర్యాక్ చేసే కస్టమర్లు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులను వినియోగించేటప్పుడు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.

English summary

Income Tax: క్రెడిట్ కార్డ్ తెగ వాడేస్తున్నారా..? అయితే ఆదాయపుపన్ను నోటీసులొస్తాయ్..! జాగ్రత్త | Credit card users may get notices from Income Tax Departmrnt know details

Credit card users may get notices from Income Tax Departmrnt know details
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X