For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ టైంలో 1.7 కోట్ల ఉద్యోగాలు పోయాయి: అర్బన్ జాబ్స్.. ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం

|

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎంతోమందికి కంపెనీలు వేతనాల్లో కోతలు విధించాయి. పట్టణ ఉద్యోగ కోత ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతుందని, ఆర్థికవృద్ధిని బలహీనపరుస్తుందని, మధ్య తరగతి కుటుంబాలకు ఇది తక్షణ నష్టాన్ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా-లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వేతనజీవులు ఉద్యోగాలు కోల్పోయారు. పట్టణ ప్రాంతాల్లో మెరుగైన ఉపాధి నిబంధనలు, ఉన్నంతలో మంచి ఆదాయాలు ఉంటాయి.

59% తిరస్కరణ: రెండేళ్లలో డబుల్.. అమెరికన్లకు ఇన్ఫోసిస్ కీలక ప్రకటన59% తిరస్కరణ: రెండేళ్లలో డబుల్.. అమెరికన్లకు ఇన్ఫోసిస్ కీలక ప్రకటన

పెరిగిన వేతన వేతనరహిత ఉపాధి

పెరిగిన వేతన వేతనరహిత ఉపాధి

ప్రతి నెల నిర్దిష్ట వేతనం ఉండటంతో వేతనజీవులు తమ ఖర్చులను, సేవింగ్స్‌ను ప్లాన్ ప్రకారం చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. తద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అవసరార్థం రుణాలు తీసుకోవడానికి కూడా ఉద్యోగాలు ఉపయోగపడతాయి. కరోనా-లాక్ డౌన్ కారణంగా ఇన్‌ఫార్మల్ ఉద్యోగాలు తిరిగి క్రమంగా పుంజుకుంటున్నాయి. కానీ ఫార్మల్ ఉద్యోగాల్లో అది కనిపించడం లేదు. వేతనంలేని ఉపాధి అవకాశాలు 201920లో 317.6 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2020 జూలై నాటికి ఇది 325.6 మిలియన్లకు పెరిగింది. అంటే దాదాపు 8 మిలియన్లు లేదా 80 లక్షలు అంటే 2.5 శాతం మేర వృద్ధి కనిపించింది.

ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం

ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం

ఓవైపు వేతనరహిత ఉపాధి భారీగా పెరగగా, వేతన ఉపాధి తగ్గిపోయింది. ఏకంగా 18.9 మిలియన్లు లేదా 1.89 కోట్లు క్షీణించింది. లాక్ డౌన్ ప్రభావంతో 22 శాతం మేర తగ్గింది. గ్రామీణ భారతం కంటే అర్బన్ భారతంలో వేతన ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. 2019-20లో దేశంలో 86 మిలియన్ల వేతన ఉద్యోగాలు ఉండగా, 58 శాతం పట్టణాల్లో 42 శాతం గ్రామీణంలో ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఉద్యోగ నష్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి. అంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ, గ్రామీణంలో చాలా తక్కువగా ఉన్నాయి.

18 ఏళ్లలో కనిష్టం

18 ఏళ్లలో కనిష్టం

పట్టణ ప్రాంతాల్లో వేతనాలు, వేతన ఉద్యోగాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఉత్పత్తి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి పట్ఠణ ఉద్యోగ నష్టం మధ్యతరగతి కుటుంబాలకు తక్షణ నష్టం కలిగించి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రధానంగా లిస్టెడ్ కంపెనీలు మంచి వేతనాలతో ఉద్యోగాలు ఇస్తాయి. కంపెనీలు తమ డేటాను త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లో అందుబాటులోకి తెస్తాయి. ఆగస్ట్ 15 నాటికి కంపెనీల డేటా రావాలి. కానీ కరోనా కారణంగా సెప్టెంబర్ 15వ తేదీ వరకు వెసులుబాటు ఇచ్చారు. 1560 లిస్టెడ్ కంపెనీల వేతన బిల్లు జూన్ 2020 త్రైమాసికంలో 2.9 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. గత 18 ఏళ్లలో ఇదే కనిష్టం.

ఏ రంగంలో ఎంత వేతన బిల్లులు పెరిగాయి

ఏ రంగంలో ఎంత వేతన బిల్లులు పెరిగాయి

బ్యాంకుల వేతన బిల్లులు 16.6 శాతం మేర పెరిగాయి. సెక్యూరిటీ బ్రోకింగ్ కంపెనీల వేతన బిల్లులు 13.5 శాతం పెరిగాయి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల వేతన బిల్లులు మాత్రం 7 శాతం తగ్గగా, సేవారంగం వేతన బిల్లులు మిశ్రమంగా ఉన్నాయి. తయారీ రంగంలో టెక్స్‌టైల్స్ ఏకంగా 29 శాతం పడిపోయాయి. అంటే ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. లెదర్ పరిశ్రమ వేతన బిల్లు 22.5 శాతం క్షీణించింది. వేతన బిల్లులు ఆటోమొబైల్ రంగంలో 18.6 శాతం, ఆటోమొబైల్ అనుబంధం 21 శాతం క్షీణించాయి. సేవా రంగం విషయానికి వస్తే టూరిజం ఇండస్ట్రీలో 30 శాతం, హోటల్స్ అండ్ రెస్టారెంట్‌లో 20.5 శాతం, రోడ్ ట్రాన్సుపోర్ట్‌లో 27.6 శాతం, విద్యలో 28 శాతం, రియల్ ఎస్టేట్‌లో 27 శాతం క్షీణించింది.

అయితే టెలికం రంగంలో మాత్రం 10.7 శాతం వేజ్ బిల్లు పెరిగింది. CPHS అంచనా ప్రకారం 1.7 కోట్ల మంది వేతన జీవులు ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఉద్యోగాలు కోల్పోయారు. జూలై నుండి ఇది మరింత దిగజారి ఉంటుందని భావిస్తున్నారు.

English summary

ఆ టైంలో 1.7 కోట్ల ఉద్యోగాలు పోయాయి: అర్బన్ జాబ్స్.. ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం | CPHS estimates show a loss of 17 million salaried jobs

'Loss of these urban salaried jobs is, therefore, likely to have a particularly debilitating impact on the economy, besides causing immediate hardship to middle-class households,' points out Mahesh Vyas.
Story first published: Thursday, September 3, 2020, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X