For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

23 ఏళ్లలో పెరిగిన సంపద కంటే కరోనా తర్వాత ఏడాదిలోనే ఎక్కువ

|

కరోనా మహమ్మారి సమాజంలో భారీ ఆర్థిక అంతరాలకు కారణం అయింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ పుట్టుకు వచ్చినట్లు తెలిపింది ఆక్స్‌ఫామ్ నివేదిక. అదే సమయంలో ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షలమంది కఠిక పేదరికంలోకి వెళ్లినట్లు తెలిపింది. గత దశాబ్దాలతో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్ పేరిట రూపొందించిన నివేదికను ఆక్స్‌ఫామ్ విడుదల చేసింది.

ఈ నివేదికలో పలు కీలక అంశాలు ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరిగాయని, దీంతో ఆహారం, ఇంధన రంగాల్లో ఉన్న బిలియనీర్ల సంపద ప్రతి రెండు రోజులకు ఒక బిలియన్ డాలర్ల చొప్పున పెరిగింది. పేదరికాన్ని రూపుమాపేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు నిష్పలమయ్యాయని, పెరుగుతున్న ధరల కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగి పేదలు జీవనం సాగించేందుకు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది.

 Covid Created A New Billionaire Every 30 Hours

కరోనా సమయంలో ప్రతి ముప్పై గంటలకు ఒక బిలియనీర్ చొప్పున 573 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకు వచ్చారు. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది చొప్పున మొత్తం ఈ ఏడాది 236 మిలియన్ల మంది పేదరికంలోకి జారుకోనున్నట్లు తెలిపింది. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత మొదటి 24 నెలల్లో బిలియనీర్ల సంపద గత 23 ఏల్లలో కలిపిన దాని కంటే పెరిగినట్లు వెల్లడించింది.

English summary

23 ఏళ్లలో పెరిగిన సంపద కంటే కరోనా తర్వాత ఏడాదిలోనే ఎక్కువ | Covid Created A New Billionaire Every 30 Hours

The report showed that 573 people became new billionaires during the pandemic, at the rate of one every 30 hours.
Story first published: Monday, May 23, 2022, 15:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X