For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19: షాకింగ్.. నెల మొత్తం ఒక్క కంపెనీ ఒక్క కారు కూడా అమ్మలేదు

|

ఏప్రిల్ నెలలో ఇండియాలో ఒక్క కారు కూడా అమ్ముడుకాలేదు. దిగ్గజ కార్ల కంపెనీలు మారుతీ సుజుకీ, మహింద్రా అండ్ మహీంద్రా, హ్యుండాయ్ మోటార్, ఎంజీ మోటార్స్, టయోటా కిర్లోస్కర్.. ఇలా ఏ సంస్థలు కూడా గత నెలలో ఒక్క కారును కూడా డొమెస్టిక్ మార్కెట్లో విక్రయించలేకపోయింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రారంభమైంది. ఇది మూడు విడతల్లో మే 17వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం. దీంతో ఏప్రిల్ నెలలో షోరూంలు మూతబడ్డాయి. దీంతో సేల్స్ లేవు.

రెడ్‌జోన్ ఎఫెక్ట్, భారీగా పెరగనున్న బ్యాడ్ లోన్స్: లాక్‌డౌన్.. పులిమీద స్వారీయేరెడ్‌జోన్ ఎఫెక్ట్, భారీగా పెరగనున్న బ్యాడ్ లోన్స్: లాక్‌డౌన్.. పులిమీద స్వారీయే

ఏప్రిల్ నెలలో ఈ దిగ్గజ కంపెనీలకు రోజుకు రూ.2,300 కోట్ల నష్టం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనాకు ముందు మందగమనంతో ఆటో పరిశ్రమ దెబ్బతిన్నది. ఇప్పుడు కరోనాతో మరింత భారీగా దెబ్బపడింది. గత ఏడాది మొత్తం 2.8మిలియన్ల పాసింజర్ వెహికిల్స్ సేల్ అయ్యాయి. కనీసం 3 మిలియన్ మార్క్ చేరుకోలేదు. 2017 తర్వాత సేల్స్ ఈ స్థాయికి దిగిపోవడం గత ఆర్థిక సంవత్సరంలోనే.

 Covid 19: Not a single car was sold in April

లాక్ డౌన్ ప్రారంభమైన మార్చి నెలలో మారుతీ సుజుకీ సేల్స్ 47.9 శాతం పడిపోయి 76,976కు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా డొమెస్టిక్ సేల్స్ కూడా 90 శాతం వరకు పడిపోయాయి. లాక్ డౌన్ మే 17వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ఆటో పరిశ్రమపై భారీ ప్రభావం పడనుంది. ఎంజీ మోటార్స్ కూడా ఏప్రిల్ నెలలో ఒక్క కారును కూడా విక్రయించలేకపోయింది.

English summary

Covid 19: షాకింగ్.. నెల మొత్తం ఒక్క కంపెనీ ఒక్క కారు కూడా అమ్మలేదు | Covid 19: Not a single car was sold in April

April was a washout month for India’s ailing auto industry. In a first, all major automakers, including Maruti Suzuki, Mahindra & Mahindra, Hyundai Motor, MG Motor, and Toyota Kirloskar, reported zero domestic car sales during the month due to the nationwide Covid-19 shutdown.
Story first published: Monday, May 4, 2020, 20:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X