For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్, భారీగా కొత్త కార్పోరేట్ రుణాలు: అమెరికా రుణాలే సగం!

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్ రుణాలు భారీగా పెరిగే అవకాశముంది. ఆర్థిక వ్యవస్థలను కుదిపేసిన వైరస్ కారణంగా గ్లోబల్ కార్పోరేట్ రుణాలు ఏకంగా 12 శాతం పెరిగి 9.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఓ నివేదిక అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు 2020 ఏడాదిలో 1 ట్రిలియన్ డాలర్లు (రూ.75 లక్షల కోట్ల వరకు) కొత్తగా రుణాలు తీసుకోవచ్చునని, 900 టాప్ కంపెనీలపై అధ్యయనం చేసిన ఓ సర్వే తెలిపింది.

కరోనా దెబ్బ... మా ఉద్యోగులకేదీ సాయం: ప్రభుత్వంపై తిరగబడ్డ వ్యాపారులు!కరోనా దెబ్బ... మా ఉద్యోగులకేదీ సాయం: ప్రభుత్వంపై తిరగబడ్డ వ్యాపారులు!

గత ఏడాదికి భిన్నంగా..

గత ఏడాదికి భిన్నంగా..

కరోనా కారణంగా గ్లోబల్ కార్పోరేట్ రుణాలు పన్నెండు శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఐదేళ్ల రుణాలకు సమానం. గత ఏడాదికి భిన్నంగా ఈ సంవత్సరం కార్పోరేట్ రుణాల్లో పెరుగుదల నమోదవుతుందని చెబుతున్నారు. కోవిడ్ 19 అన్నింటిని మార్చివేసిందని జానూస్ హెండ్రెసన్ పోర్ట్‌పోలియే మేనేజర్ సేథ్ మెయెర్ అన్నారు. ఇప్పుడు మూలధనం రక్షించుకోవడం, బలమైన బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవడం అవసరమన్నారు.

మార్చిలో వారికి రుణాలిచ్చేందుకు డోర్లు క్లోజ్

మార్చిలో వారికి రుణాలిచ్చేందుకు డోర్లు క్లోజ్

జనవరి - మే మధ్య కంపెనీల బాండ్ మార్కెట్ 384 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. కరోనా తీవ్రరూపం కనిపించిన మార్చి నెలలోనే అత్యంత విశ్వసనీయ కంపెనీలు మినహా మిగతా సంస్థలన్నింటీకి రుణ మార్కెట్లు డోర్స్ క్లోజ్ చేసినట్లు సేథ్ మెయెర్ అన్నారు. అయితే అమెరికా ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ జపాన్... ఎమర్జెన్సీ కార్పోరేట్ క్రెడిట్ లోన్ స్కీం ద్వారా చర్యలు తీసుకోవడంతో పరిస్థితి సానుకూలంగా మారిందని చెబుతున్నారు. మన దేశంలో ఆర్బీఐ, ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు లిక్విడిటీ మద్దతు, క్రెడిట్ గ్యారెంటీ స్కీం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.

అమెరికా, జపాన్ రుణాలు

అమెరికా, జపాన్ రుణాలు

అమెరికా కంపెనీలు దాదాపు ప్రపంచ కార్పోరేట్ రుణాల్లో దాదాపు సగం కలిగి ఉన్నాయి. అగ్రరాజ్యం కంపెనీల రుణాలు 3.9 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో గత అయిదేళ్లలో వేగం కనిపించింది. జర్మనీ 762 బిలియన్ డాలర్లతో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రుణాలు కలిగిన మూడు కంపెనీలను కలిగి ఉంది. వోక్స్‌వాగన్ సంస్థవి 192 బిలియన్ డాలర్లు ఉన్నాయి. సౌతాఫ్రికా, హంగేరీ దేశాల రుణాలతో దాదాపు సమానం.

English summary

కరోనా ఎఫెక్ట్, భారీగా కొత్త కార్పోరేట్ రుణాలు: అమెరికా రుణాలే సగం! | Covid 19 bringing record $1 trillion of new global corporate debt in 2020

Companies around the world will take on as much as $1 trillion of new debt in 2020, as they try to shore up their finances against the coronavirus, a new study of 900 top firms has estimated.
Story first published: Monday, July 13, 2020, 10:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X