For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BigBasket గుడ్‌న్యూస్: కొద్ది రోజుల్లో 12,000 కొత్త ఉద్యోగాలు

|

భారత అతిపెద్ద ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్ బిగ్ బాస్కెట్ 10,000 గుడ్ న్యూస్ చెప్పింది. 10,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు స్పష్టం చేసింది. 2,000 మంది అదనపు వర్కర్స్‌ను కూడా తీసుకుంటామని, మొత్తంగా 12,000 మందిని తీసుకుంటామని తెలిపింది. ఇందులో వేర్‌హౌస్‌లలో పని చేసేందుకు పర్మినెంట్ ఆన్ గ్రౌండ్ స్టాఫ్‌ను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్‌లలో, డెలివరీ పర్సనల్స్‌ను మరికొద్ది రోజుల్లోనే తీసుకుంటామని తెలిపింది.

కరోనా మహమ్మారి దెబ్బకు చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అదే సమయంలో ఆన్‌లైన్ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బిగ్ బాస్కెట్ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ వల్ల దాదాపు దేశమంతా స్తంభించింది.

COVID 19: BigBasket to hire 10,000 delivery boys

ఈ నేపథ్యంలో సరుకుల రవాణా కోసం దేశవ్యాప్తంగా 10 వేలమందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది. వేర్‌హౌస్, లాస్ట్ మైల్ డెలివరి అవసరాల నిమిత్తం 26 నగరాల్లో పదివేల మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బిగ్ బాస్కెట్ వైస్ ప్రెసిడెంట్ (మానవ వనరులు) తనుజా తివారీ తెలిపారు. ప్రస్తుతం గోదాములు, సరఫరా విభాగాల్లో 50 శాతం సిబ్బంది కొరత ఉందన్నారు.

English summary

BigBasket గుడ్‌న్యూస్: కొద్ది రోజుల్లో 12,000 కొత్త ఉద్యోగాలు | COVID 19: BigBasket to hire 10,000 delivery boys

India’s largest online grocer BigBasket said it will hire 10,000 permanent on-ground staff to work at warehouses, distribution centres and as delivery personnel, over the next few days.
Story first published: Saturday, April 4, 2020, 20:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X