For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాస్త ఊరట: 10 శాతం తగ్గిన అవినీతి, తెలంగాణలో లంచాలు ఎక్కువే.. ఏ రూపంలో ఇస్తున్నారంటే?

|

ఊరట కలిగించే విషయం... భారతదేశంలో కరప్షన్ తగ్గుతోందట. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే అవినీతి సూచీలో భారతదేశం మెరుగు కనబరిచింది. 180 దేశాల జాబితాలో భారత్ మూడు స్థానాలు ఎగబాకి 78వ స్థానానికి చేరుకుంది. ఇండియా కరప్షన్ సర్వే 2019 ప్రకారం గత ఏడాది ప్రతి ఇద్దరిలో ఒకరు లంచం సమర్పించారు. తద్వారా 51 శాతం మంది కరప్షన్‌లో ఇన్వాల్వ్ అయ్యారు.

ఏపీ తర్వాత తెలంగాణలో ఊరట: అక్కడ కిలో ఉల్లి రూ.40 మాత్రమే!ఏపీ తర్వాత తెలంగాణలో ఊరట: అక్కడ కిలో ఉల్లి రూ.40 మాత్రమే!

ఎక్కువ లంచాలు వీరికే...

ఎక్కువ లంచాలు వీరికే...

ఈ సర్వే ప్రకారం ఎక్కువగా లంచాలు పోలీసు, మున్సిపాలిటీ, ట్రాన్స్‌పోర్ట్ డిపార్టుమెంట్లకే అందాయని తెలిపింది. ఈ విభాగాలలో లంచాలు ఎక్కువగా డిమాండ్ చేసినట్లుగా తేల్చింది.

10 శాతం తగ్గిన అవినీతి

10 శాతం తగ్గిన అవినీతి

ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం 2019లో భారతదేశంలో కరప్షన్ 10 శాతం వరకు తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1.9 లక్షల మంది రెస్పాండెంట్స్ నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదికను తయారు చేశారు. ట్రాన్సుపరెన్సీ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ సర్వేను నిర్వహించారు.

2017లో లంచగొండితనం 45 శాతమే

2017లో లంచగొండితనం 45 శాతమే

అంతకుముందు ఏడాది లంచగొండితనం 56 శాతంగా ఉంది. ఇప్పుడు అది 51 శాతానికి తగ్గింది. 2017లో మాత్రం కేవలం 45 శాతం మంది మాత్రమే లంచాలు ఇచ్చినట్లుగా సర్వే రిపోర్ట్ చెబుతోంది.

లంచగొండితనం ఎక్కువ.. తక్కువ ఉన్న రాష్ట్రాలు..

లంచగొండితనం ఎక్కువ.. తక్కువ ఉన్న రాష్ట్రాలు..

లంచం చెల్లించే రాష్ట్రాల్లో రాజస్థాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు ముందున్నాయి. ఢిల్లీ, హర్యానా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, గోవా, ఒడిశా రాష్ట్రాలలో లంచగొండితనం రేటు తక్కువగా ఉంది.

లంచాలు ఎలా ఇస్తున్నారంటే?

లంచాలు ఎలా ఇస్తున్నారంటే?

ప్రభుత్వ కార్యాలయాలలోను లంచగొండితనానికి పాల్పడినవి ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం.. క్యాష్, బహుమతులు, ఏజెంట్స్ ద్వారా ఇచ్చిన లంచాలు దాదాపు 35 శాతం ఉన్నాయి. 6 శాతం ఫేవర్స్ (నీకిది-నాకది) రూపంలో చెల్లించారు. మరో 37 శాతం మంది తాము పనులు చేసుకునేందుకు లంచం చెల్లించలేదని తెలిపారు.

English summary

కాస్త ఊరట: 10 శాతం తగ్గిన అవినీతి, తెలంగాణలో లంచాలు ఎక్కువే.. ఏ రూపంలో ఇస్తున్నారంటే? | Corruption declines in India by 10% in 2019: Survey

India has improved its ranking in the corruption index from last year as per the data released by Transparency International, moving three places up and now stands at 78th position in a list of 180 countries.
Story first published: Thursday, November 28, 2019, 13:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X