చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికే వణికిపోతున్నారు. రోజువారీ వేతనాలు లేదా ప్రతిరోజు పని చేసుకుంటేనే బతికే వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) మరో షాకింగ్ అంశాన్ని వెల్లడించింది.

2.5 కోట్ల ఉద్యోగాలు హుష్‌కాకి
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తెలిపింది. దాదాపు 2.5 కోట్ల (25 మిలియన్లు) ఉద్యోగులు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే 2008-09లో అంతర్జాతీయ దేశాలు ఆర్థిక సంక్షోభంపై ఉమ్మడి ముందుకు వెళ్తే నిరుద్యోగ ప్రభావం తగ్గుతుందని తెలిపింది.

కార్మికులు కోల్పోయే ఆదాయం రూ.3.4 లక్షల కోట్ల డాలర్లు
అంతర్జాతీయంగా పరస్పర సహకార విధానాల ద్వారా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ILO తెలిపింది. ఈ ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8,600 కోట్ల డాలర్ల నుండి 3.4 లక్షల కోట్ల డాలర్ల మేర ఆధాయాన్ని కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించింది.

ఈ చర్యలు చేపట్టాలి
కార్మికులను సంరక్షించేందుకు, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అలాగే ఉద్యోగాలు, ఆదాయలకు మద్దతిచ్చేందుకు అత్యవసర, పెద్ద ఎత్తున సమన్వయ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అదే విధంగా సోషల్ ప్రొటక్షన్ విస్తరణ, ఎంప్లాయిమెంట్ రిటెన్షన్ సపోర్ట్ (ఉదాహరణకు.. షార్ట్ టైమ్ వర్క్, పెయిడ్ లీవ్స్ వంటివి)తో పాటు MSMEలకు ఆర్థికపరమైన, ట్యాక్స్ సంబంధిత ఉపశమనాలు ఇవ్వాలని సూచించింది ILO.

పదేళ్ళ క్రితం సంక్షోభం వల్ల..
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ జీడీపీపై భారీగా పడనుందని ILO పేర్కొంది. తక్కువ ప్రభావం పడితే 5.3 మిలియన్ల ఉద్యోగాలపై, ఎక్కువ ప్రభావం ఉంటే 24.7 మిలియన్ల ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని తెలిపింది. ఇది 2019లో 188 మిలియన్లుగా ఉంది. 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం 22 మిలియన్ల నిరుద్యోగాలను జత చేసిందని గుర్తు చేసింది.

పని గంటలు తగ్గి, వేతనాలు తగ్గి
అండర్ ఎంప్లాయిమెంట్ కూడా పెరిగే అవకాశముందని ILO ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కారణంగా వర్కింగ్ హవర్స్ తగ్గి, వేతనాలు తగ్గి ఈ పరిస్థితికి కారణం కావొచ్చునని పేర్కొంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పైనా ప్రభావం పడుతుందని పేర్కొంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications