2021 సంవత్సరం నాటికి ఎక్కువ దేశాల్లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సీన్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. వ్యాక్సీన్ అందుబాటులోకి రావడంతో 2022 నాటికి కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా తగ్గిపోతుందన్నారు. కరోనా వల్ల కలిగిన ఆర్థిక నష్టం తిరిగి పుంజుకోవడం కష్టమేనని చెప్పారు.
ఈ వైరస్ పోరులో భాగంగా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, నూతన చికిత్సా విధానం, వ్యాక్సీన్ తయారీ, పరిశోధనలు వంటి అంశాల్లో కీలక అడుగులు పడుతున్నాయన్నారు. వీటి వల్లనే మనం ధనిక ప్రపంచంలో ఉన్నామనే భావన కలుగుతోందన్నారు. ఈ రిచ్ వరల్డ్ 2021 చివరి నాటికి కరోనాను అంతం చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. 2022 నాటికి మిగిలిన దేశాల నుండి కరోనా వెళ్లిపోతుందన్నారు.

కరోనా వ్యాక్సీన్ పరిశోధనల కోసం గేట్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చింది. గేట్స్ ఫౌండేషన్ నుండి తమకు 150 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందనుందని పుణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు గత వారమే ప్రకటించింది. ఈ మేరకు సీరమ్ సంస్థ, గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సీన్ అండ్ ఇమ్యునైజేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో దాదాపు 100 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సీన్లను తయారు చేసి భారత్ సహా 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ప్రకటించింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications