For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోవిడ్ ఎఫెక్ట్: భారీగా తగ్గనున్న విదేశీ రెమిటెన్సులు!

|

కరోనా వైరస్ తో అన్నీ కష్టాలే. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసిన మాయదారి మహమ్మారి... ఇప్పుడు భారత్ కు రావాల్సిన విదేశీ రెమిటెన్సులను కూడా దెబ్బతీయనుంది. మన దేశం నుంచి అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, గల్ఫ్ దేశాలకు వెళ్లిన కోట్ల మంది ప్రవాస భారతీయులు ... ఏటా కొన్ని రూ వేల కోట్ల రెమిటెన్సులు ఇండియా కు పంపుతారు. కానీ, ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల దరిమిలా ఆ విదేశీ మారక ప్రవాహానికి అడ్డుకట్టపడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

ప్రవాసులు తమ సొంత దేశానికి పంపే రెమిటెన్సుల్లో ఇండియన్స్ ముందుంటారు. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక మొత్తం రెమిటెన్సులను పొందే దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ విషయంలో జనాభా పరంగా నెంబర్ 1 గా ఉన్న పొరుగుదేశం చైనా కూడా మన కంటే వెనుకబడే ఉంటుంది. కానీ, ఇప్పుడు విదేశాల్లో నివసిస్తున్న వారికి కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వారు, ఉపాధి కరువు ఐన వారు ఉన్నారు. వారంతా ముందు బతకడం కోసం పోరాడుతున్నారు. రెమిటెన్సుల సంగతి తర్వాత...

చైనాకు చెక్: ఆటో విడిభాగాల తయారీ ఇక ఇండియాలోనే! మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీల చేయూత

రూ 6.22 లక్షల కోట్లు...

రూ 6.22 లక్షల కోట్లు...

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో స్థిరపడిన భారతీయులు ప్రతి ఏటా ఇండియా లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్నారు. 2019 లో అలా వారు పంపిన మొత్తం విలువ 83 బిలియన్ డాలర్లు గా ఉంది. అంటే మన కరెన్సీ లో సుమారు రూ 6.22 లక్షల కోట్లకు సమానం. ఇలా భారతీయులు ఇండియా కు పంపుతున్న రెమిటెన్సులు ప్రతి ఏటా మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుండటం విశేషం. 2018 లో పంపిన 79 బిలియన్ డాలర్లు అత్యధికం కాగా... దానిని కూడా గతేడాది అధిగమించటం విశేషం. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, దాదాపు అన్ని దేశాల్లో లొక్డౌన్ విధింపు, ఉద్యోగాలు కోల్పోవటం, మనీ ట్రాన్స్ఫర్ సేవల తాత్కాలిక మూసివేత వంటి అనేక కారణాలతో ఈ ఏడాది మాత్రం రెమిటెన్సుల పరిమాణం తగ్గే అవకాశం కనిపిస్తోంది.

20% తగ్గొచ్చు...

20% తగ్గొచ్చు...

పైన పేర్కొన్న అనేక కారణాల వల్ల ఈ సారి ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్సుల ప్రవాహం సుమారు 20% తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు (వరల్డ్ బ్యాంకు) లీడ్ ఎకనామిస్ట్ దిలీప్ రథ ను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా ఏజెన్సీ బ్లూమ్బెర్గ్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దిలీప్ అంచనా ప్రకారం 2020 లో రెమిటెన్సులు సుమారు 109 బిలియన్ల మేరకు తగ్గి 445 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతాయి. 2019 లో మొత్తం రెమిటెన్సులు 554 బిలియన్ డాలర్లు కావటం గమనార్హం. ఈ ప్రభావం ఇప్పటి వరకు ఎంతో పటిష్టంగా ఉన్న భారత్ పైన కూడా అధికంగా కనిపించే అవకాశం ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం రెమిటెన్సుల్లో నగదు రూపంలోనే 80-85% లావాదేవీలు జరుగుతాయి కాబట్టి.... ఈ సారి దాని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఇండియా లో కేరళ రాష్ట్రము అత్యధిక మొత్తంలో రెమిటెన్సులు పొందుతుంది కాబట్టి, దానిపైనే అధిక ప్రభావం ఉండే అవకాశం ఉంది.

2 కోట్ల మంది...

2 కోట్ల మంది...

ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా ప్రపంచంలోని ఏ మూల లోనైనా భారతీయులు ఉండి తీరుతారు. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్య సమితి) అధికారిక అంచనాల ప్రకారమే సుమారు 1.75 కోట్ల మంది ప్రవాస భారతీయులు వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్నారు. కానీ, అనధికారికంగా ఈ సంఖ్య 2 కోట్లకంటే అధికంగా ఉంటుందని చెబుతారు. ఇందులో మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రవాసం వెళ్లిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఒక అనధికారిక అంచనా ప్రకారం సుమారు 16 లక్షల నుంచి 18 లక్షల మంది తెలుగు వారు అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మరిన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్థిరపడ్డారు. గల్ఫ్ లో కూడా మన వారి సంఖ్య అధికమే. దాంతో పాటు కొన్ని ఆఫ్రికా దేశాలకు కూడా వలసపోయినట్లు రికార్డులున్నాయి.

English summary

coronavirus impact on Remittance flow

Remittance flows attained a milestone last year, overtaking the flow of foreign direct investment to developing countries for the first time: There was $554 billion in international remittances, against $540 billion in FDI. And this only accounts for recorded remittances — most of the money going to Venezuela, for example, is not measured.
Story first published: Saturday, July 11, 2020, 10:19 [IST]
Company Search
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more