For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid-19: GoAir ఉద్యోగుల ఉద్యోగులకు షాక్, శాలరీలో కోత, 24 రోజులు పని చేసినా...

|

కరోనా వైరస్ ప్రభావం విమానయానరంగ ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వివిద దేశాల్లో విమాయాన సేవలు అందించే సంస్థలు తమ ఉద్యోగుల వేతనాలు తగ్గించడం లేదా తాత్కాలిక ఉద్యోగులను పక్కన పెట్టడం జరిగింది. తాజాగా గోఎయిర్ సంస్థ ఉద్యోగుల వేతనంలో కోత విధిస్తోంది. పర్యాటక, విమానయాన రంగంపై ఈ ప్రభావం భారీగానే పడింది. ఇప్పుడు దేశమంతా లాక్ డౌన్‌లో ఉంది. దీంతో ఆ సంస్థలు ఉద్యోగుల వేతనంలో కోత విధిస్తున్నాయి.

covid-19: 8,000 మంది ట్రైనీలను ఇంటికి పంపిన ఇన్ఫోసిస్!covid-19: 8,000 మంది ట్రైనీలను ఇంటికి పంపిన ఇన్ఫోసిస్!

ఇంతకుమించి ఏం చేయలేం

ఇంతకుమించి ఏం చేయలేం

కరోనా మహమ్మారి వల్ల విమానయాన ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడిందని, దీంతో తమ ఉద్యోగుల మార్చి వేతనంలో కోత ఉంటుందని గోఎయిర్ సీఈవో వినయ్ దుబే వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించి చేయడానికి తమకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం పంపించారు.

తక్కువ వేతనం ఉంటే తక్కువ ప్రభావం

తక్కువ వేతనం ఉంటే తక్కువ ప్రభావం

తక్కువ వేతనం ఇచ్చే వారిపై తక్కువ ప్రభావం పడేలా చూస్తామని కూడా వినయ్ దుబె వెల్లడించారు. అప్పటికే వేతనం తక్కువ ఉంటుంది కాబట్టి వారి వేతనంలో సాధ్యమైనంత తక్కువ కట్టింగ్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.

14 ఏళ్ల చరిత్రలో తొలిసారి

14 ఏళ్ల చరిత్రలో తొలిసారి

14 సంవత్సరాల గోఎయిర్ చరిత్రలో ఎప్పుడు కూడా వేతనాలు తగ్గించలేదని వినయ్ దుబే ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడ్డాక మీ త్యాగానికి ఫలితంగా కాంపన్సేట్ ప్రయత్నాలు చేస్తామన్నారు.

ఉద్యోగుల సూటి ప్రశ్న

ఉద్యోగుల సూటి ప్రశ్న

తాము మార్చి నెలలో 24 రోజులు పని చేశామని, ఇలాంటప్పుడు తమ వేతనాలు ఎలా కట్ చేస్తారని ఉద్యోగుల ప్రశ్న. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వేతన కోత అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని, నగదును కాపాడుకునేందుకు చేసే పని అని చెబుతున్నారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితుల్లో ఇదో ఆప్షన్ అంటున్నారు.

అర్జంట్ ఫండింగ్

అర్జంట్ ఫండింగ్

ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఉద్యోగుల వేతనాలు చెల్లించలేకపోతున్నామని, కనీసం 50 శాతం మంది ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం అర్జెంట్ ఫండ్ ఇవ్వాలని కోరుతున్నారు. రానున్న మూడు నెలలు ఈ పరిస్థితి దారుణంగా ఉండేలా ఉందని, ఈ మేరకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. కాగా, అంతకుముందు ఇండిగో, ఎయిరిండియా కూడా వేతనాల్లో కోత విధించింది.

English summary

Covid-19: GoAir ఉద్యోగుల ఉద్యోగులకు షాక్, శాలరీలో కోత, 24 రోజులు పని చేసినా... | Coronavirus crisis: GoAir employees pay to be cut in March

GoAir will cut salary of all its employees for month of March following grounding of all domestic flights in the country.
Story first published: Thursday, March 26, 2020, 8:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X