For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: రూ.660 లక్షల కోట్ల నష్టం, చైనాకు భారీ దెబ్బ: శాలరీ తగ్గుదల 1.8 లక్షల కోట్లు

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. గ్లోబల్ ఎకానమీకి వాటిల్లే నష్టాన్ని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ADB) ఈ నష్టం అంచనాలను భారీగా పెంచింది. దాదాపు రూ.435 లక్షల కోట్ల నుండి రూ.660 లక్షల కోట్ల (5.8 లక్షల కోట్ల నుండి 8.8 లక్షల కోట్ల డాలర్లు) వరకు నష్టం వాటిల్లే అవకాశముందని తెలిపింది.

వారు అడిగిన దాని కంటే భారీ ప్యాకేజీ: నిపుణుల సూచన.. జీడీపీలో 10%వారు అడిగిన దాని కంటే భారీ ప్యాకేజీ: నిపుణుల సూచన.. జీడీపీలో 10%

భారీ నష్ట అంచనా

భారీ నష్ట అంచనా

ప్రపంచ జీడీపీలో ఇది 6.4 శాతం నుండి 9.7 శాతానికి సమానమని ఏడీబీ తన నివేదికలో పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ జీడీపీకి 2 శాతం నుండి 4 శాతం మేర నష్టం వాటిల్లే అవకాశముందని అంతకుముందు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దీనికి రెట్టింపు నష్టాన్ని ఏడీబీ అంచనా వేస్తోంది. ప్రపంచ జీడీపీ 6.3 శాతం మేర తగ్గవచ్చునని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) వేసిన అంచనా కంటే కూడా ఏడీపీ అంచనా ఎక్కువ.

దక్షిణాసియాలో 16.56 లక్షల కోట్ల నష్టం

దక్షిణాసియాలో 16.56 లక్షల కోట్ల నష్టం

ఆయా దేశాలు చేపట్టిన విధాన చర్యల ప్రభావాన్ని మాత్రం అంచనాల్లో కలపలేదని ఏడీబీ పేర్కొంది. ఈ నివేదికలోను అంశాలు ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించేందుకు వివిధ దేశాలకు మార్గసూచీగా ఉపయోగపడతాయని ఏడీపీ ప్రతినిధులు చెబుతున్నారు. దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది దక్షిణాసియా దేశాలలో జీడీపీ 3.9 శాతం నుండి 6 శాతానికి తగ్గిపోవచ్చునని తెలిపింది. దక్షిణాసియా జీడీపీపై 14,200 కోట్ల డాలర్ల నుంచి 21,800 కోట్ల డాలర్లకు సమానమని తెలిపింది. మన కరెన్సీలో రూ.10.79 లక్షల కోట్ల నుండి 16.56 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అమలు చేస్తున్న కఠిన ఆంక్షల వల్ల దక్షిణాసియా జీడీపీ 3.9 శాతం నుండి 6 శాతం మేర తగ్గవచ్చునని అంచనా వేసింది.

ఏడీబీ అంచనాలు ఇలా...

ఏడీబీ అంచనాలు ఇలా...

కరోనా వల్ల కలిగే నష్టాన్ని మార్చి 6న ఏడీబీ రూ.6 లక్షల కోట్ల నుండి రూ.26 లక్షల కోట్ల వరకు అంచనా వేసింది.

ఏప్రిల్ 3న రూ.150 లక్షల కోట్ల నుండి రూ.305 లక్షల కోట్ల వరకు అంచనా వేసింది.

మే 15న రూ.435 లక్షల కోట్ల నుండి రూ.660 లక్షల కోట్ల వరకు అంచనా వేసింది.

- వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే నష్టం 4.1 లక్షల కోట్ల డాలర్ల నుండి 5.4 లక్షల కోట్ల డాలర్లు (రూ.300 లక్షల కోట్ల డాలర్ల నుండి రూ.400 లక్షల కోట్ల డాలర్లు)కు పరిమితం అవుతుంది.

చైనాకు భారీ ఆర్థిక నష్టం

చైనాకు భారీ ఆర్థిక నష్టం

- కరోనా ప్రభావం మూడు నెలలు కొనసాగితే ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థకు 1.7 లక్షల కోట్ల డాలర్లు (రూ.128 లక్షల కోట్లు) నష్టం రావొచ్చునని అంచనా. 6 నెలలు కొనసాగితే 2.5 లక్షల కోట్ల డాలర్లు (రూ.185 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. ప్రపంచానికి వాటిల్లే నష్టంలో ఇది 30 శాతం.

- చైనా ఆర్థిక వ్యవస్థకు వాటిల్లో నష్టం 1.1 లక్షల డాలర్ల నుండి 1.6 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. మన కరెన్సీలో రూ.80 లక్షల కోట్ల నుండి రూ.120 లక్షల కోట్లు.

- సప్లై చైన్ తెగిపోవడం వల్ల వివిధ రంగాల్లో ఉత్పత్తి, పెట్టుబడులు, పర్యాటకంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. మరింత కాలం షట్ డౌన్ ఉంటే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కష్టమేనని పేర్కొంది. అలాగే కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఉండకూడదంటే ఉద్యోగ, ఆదాయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

వేతనాల తగ్గుదల ప్రభావం రూ.1.8 లక్షల కోట్ల డాలర్ల వరకు..

వేతనాల తగ్గుదల ప్రభావం రూ.1.8 లక్షల కోట్ల డాలర్ల వరకు..

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి, ఉద్యోగాలు ఉన్నప్పటికీ వేతనాలు తగ్గిపోతున్నాయి. ఈ తగ్గుదల ఎంత లేదన్నా 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది. ఆసియా దేశాల్లోనూ కార్మికుల వేతనాలు 30% వరకు తగ్గవచ్చునని తెలిపింది.

English summary

COVID 19: రూ.660 లక్షల కోట్ల నష్టం, చైనాకు భారీ దెబ్బ: శాలరీ తగ్గుదల 1.8 లక్షల కోట్లు | Coronavirus could cost global economy dollar 8.8 trillion

The coronavirus pandemic could cost the global economy between $5.8tn and $8.8tn (£4.7tn-£7.1tn), according to Asian Development Bank (ADB).
Story first published: Sunday, May 17, 2020, 10:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X