For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

60 ఏళ్లలో ఆసియాలో తొలిసారి, ప్రజలకు డబ్బు ట్రాన్సుఫర్ సరికాదేమో: IMF హెచ్చరిక

|

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆసియా ఆర్థిక వృద్ధి రేటుపై భారీ ప్రభావం పడనుంది. 60 ఏళ్ల తర్వాత మొదటిసారి వృద్ధి నిలిచిపోనుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తెలిపింది. ఈ వైరస్ కారణంగా సేవారంగం, ఎగుమతి సహా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఆసియా వృద్ధి రేటు నిలిచిపోనుంది. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. నష్టపోయిన రంగాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఐఎంఎఫ్ వెల్లడించింది.

ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త, కరోనా టైంలో వేతనాలు పెరిగాయి, రూ.10,000 అలవెన్స్ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త, కరోనా టైంలో వేతనాలు పెరిగాయి, రూ.10,000 అలవెన్స్

ఆసియా పసిఫిక్ మినహాయింపు కాదు

ఆసియా పసిఫిక్ మినహాయింపు కాదు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. గ్లోబల్ ఎకానమీకి ఇది పెను సవాల్ అని పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతం దీనికి మినహాయింపు కాదని పేర్కొంది. ఈ ప్రాంతంపై కూడా వైరస్ ప్రభావం ఎక్కువే ఉందని తెలిపింది. యధావిధి వ్యాపారానికి ఇది సమయం కాదని, ఆసియా దేశాలు తమ టూల్ కిట్‌లోని అన్ని పాలసీ సాధనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉందని IMF ఆసియా అండ్ పసిఫిక్ డిపార్టుమెంట్ డైరెక్టర్ చాంగ్‌యాంగ్ రీ అన్నారు.

60 ఏళ్లలో తొలిసారి సున్నా వృద్ధి

60 ఏళ్లలో తొలిసారి సున్నా వృద్ధి

60 ఏళ్లలో తొలిసారి ఆసియా పసిఫిక్ దేశాలు సున్నా శాతం వృద్ధిని నమోదు చేయనున్నాయని IMF గురువారం విడుదల చేసిన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఆర్థికంగా చితికిపోతున్న మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ దేశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. 1990లలో ఆసియా అభివృద్ధి 1.3 శాతంగా నమోదయిందని గుర్తు చేసింది.

2008 సంక్షోభానికి భిన్నం

2008 సంక్షోభానికి భిన్నం

విజయవంతమైన పాలసీలతో వృద్ధి ఉంటుందని ఐఎంఎఫ్ ఆశిస్తోంది. 2008లో లెమాన్ బ్రదర్స్ పతనం వల్ల ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి భిన్నంగా ఈ మహమ్మారి నేరుగా ప్రాంతీయ సేవ రంగాలను తాకిందని తెలిపింది. ప్రజలు ఇళ్ల వద్దే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయిని దుకాణాలు తెరుచుకోవడం లేదని, ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపింది.

ఆ దేశాల నుండి డిమాండ్ తగ్గింది.. చైనా వృద్ధి రేటు 1.2 శాతం

ఆ దేశాల నుండి డిమాండ్ తగ్గింది.. చైనా వృద్ధి రేటు 1.2 శాతం

అమెరికా, యూరోపియన్ కంట్రీస్ వంటి ముఖ్య వాణిజ్య దేశాల నుండి డిమాండ్ మందగించిందని, ఈ ప్రభావం ఆసియా పసిఫిక్ పైన పడిందని ఐఎంఎఫ్ తెలిపింది. చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 1.2 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. అంతకుముందు జనవరిలో 6 శాతం అంచనా వేసింది. కరోనా వల్ల లాక్ డౌన్, ఎగుమతులపై ప్రభావం, సామాజిక దూరం వంటి వాటి కారణంగా వృద్ధి రేటు పడిపోనుంది.

వృద్ధిపై ప్రభావం

వృద్ధిపై ప్రభావం

ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఈ ఏడాది చివరలో తిరిగి పుంజుకోవచ్చునని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది తిరిగి వృద్ధి రేటు 9.2 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. అయితే చైనాలో కరోనా ప్రభావం పుంజుకుంటే వృద్ధి రేటుపై ప్రభావం ఉంటుందని తెలిపింది.

డైరెక్ట్ డబ్బులు ట్రాన్సుఫర్ సరైన విధానం కాకపోవచ్చు

డైరెక్ట్ డబ్బులు ట్రాన్సుఫర్ సరైన విధానం కాకపోవచ్చు

అమెరికాలో మాదిరి ప్రజలకు డైరెక్ట్ క్యాష్ ట్రాన్సుఫర్ బెనిఫిట్స్ పలు ఆసియా దేశాల్లో సరైన విధానం కాకపోవచ్చునని ఐఎంఎఫ్ అబిప్రాయపడింది. దీనికంటే నిరుద్యోగం పెరగకుండా ఆపడం, చిన్న సంస్థలు చితికిపోకుండా చూడటంపై దృష్టి సారించాలని తెలిపింది.

English summary

60 ఏళ్లలో ఆసియాలో తొలిసారి, ప్రజలకు డబ్బు ట్రాన్సుఫర్ సరికాదేమో: IMF హెచ్చరిక | Corona to bring Asia's 2020 growth to halt for 1st time in 60 years: IMF

Asia's economic growth this year will grind to a halt for the first time in 60 years, as the coronavirus crisis takes an "unprecedented" toll on the region's service sector and major export destinations, the International Monetary Fund said on Thursday.
Story first published: Thursday, April 16, 2020, 14:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X