For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్: సబ్బుల ధరలు భారీగా తగ్గిస్తున్న కంపెనీలు, 2 కోట్ల సోప్స్ ఉచిత పంపిణీ

|

కరోనా వైరస్ కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో FMCG తయారీ సంస్థలు కరోనాను ఎదుర్కొనేందుకు చేతులు కలిపాయి. ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా నడుం బిగించాయి. ఇందులో భాగంగా విపత్కర సమయాల్లో బాధ్యతతో ఉంటూ.. సబ్బులు, శానిటైజర్ తదితర ఉత్పత్తుల ధరలను తగ్గించాలని నిర్ణయించాయి. అంతేకాదు, వీటి ఉత్పత్తిని పెంచాలని కూడా నిర్ణయించాయి.

శానిటైజర్, మాస్కుల ధర భారీగా పెంపు, రంగంలోకి దిగిన కేంద్రంశానిటైజర్, మాస్కుల ధర భారీగా పెంపు, రంగంలోకి దిగిన కేంద్రం

ముందుకొచ్చిన HUL, గోద్రోజ్, పతంజలి

ముందుకొచ్చిన HUL, గోద్రోజ్, పతంజలి

హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL), గోద్రేజ్, పతంజలి సహా వివిధ కంపెనీలు కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో తమవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇందుకు ఉత్పత్తులు పెంచడం, ధరలి తగ్గించడంతో పాటు సాయం కూడా అందించనున్నాయి. కరోనాపై పోరాడేందుకు HUL రూ.100 కోట్ల సాయం చేయనున్నట్లు శుక్రవారం తెలిపింది.

HUL ఏం చెప్పిందంటే

HUL ఏం చెప్పిందంటే

కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకు విక్రయిస్తామని HUL ప్రకటించింది. వ్యక్తిగత, గృహ పరిశుభ్రతకు ఉపయోగించే ఉత్పత్తుల్ని తక్కువ ధరలకే అందించనున్నామని తెలిపింది. ప్రజా ప్రయోజనార్ధం​ ముఖ్యంగా లైఫ్‌బాయ్ శానిటైజర్, లిక్విడ హ్యాండ్ వాష్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరల్ని 15 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి తర్వలో ఉత్పత్తిని ప్రారంభిస్తామని, కొద్ది వారాల్లో మార్కెట్లోకి వస్తాయని తెలిపింది.

2 కోట్ల లైఫ్‌బాయ్ సోప్స్ ఉచితంగా..

2 కోట్ల లైఫ్‌బాయ్ సోప్స్ ఉచితంగా..

వచ్చే నెలల్లో దేశవ్యాప్తంగా 2 కోట్ల లైఫ్‌బాయ్ సోప్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తామని HUL చైర్మన్, ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. లైఫ్‌బాయ్ శానిటైజర్స్, లైఫ్‌బాయ్ హ్యాండ్ వాష్ లిక్విడ్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ఉత్పత్తిని వేగవంతం చేశామనీ, రాబోయే వారాల్లో దీనిని మరింత పెంచుతామన్నారు. ఇలాంటి సమయంలో తమవంటి కంపెనీలు కీలక పాత్ర పోషించాల్సి ఉందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య విపత్తును అధిగమించేలా ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు.

ముడిసరుకుల ధరలు పెరిగినా ధరలు తగ్గిస్తామని.. పతంజలి, గోద్రోజ్

ముడిసరుకుల ధరలు పెరిగినా ధరలు తగ్గిస్తామని.. పతంజలి, గోద్రోజ్

ఎగ్జామ్ సెంటర్స్, ఆసుపత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల్ని అప్‌గ్రేడ్ చేయడానికి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు మెహతా తెలిపారు. మ‌రోవైపు స‌బ్బుల త‌యారీకి అవ‌స‌రమయ్యే ముడిస‌రుకుల ధ‌ర‌లు పెరిగినా స‌బ్బుల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు పతంజలి, గోద్రేజ్ వంటి సంస్థలు కూడా ప్రకటించాయి.

కస్టమర్లకు భారం కానివ్వం..

కస్టమర్లకు భారం కానివ్వం..

తమ సబ్బుల ధరలను 12.5 శాతం వ‌ర‌కు తగ్గిస్తున్నట్లు పతంజలి, గోద్రేజ్ తెలిపాయి. అలోవేరా, హల్దీ-చందన్ సబ్బుల ధరను తగ్గిస్తున్నట్లు పతంజలి అధికార ప్రతినిధి తిజరావ్లా తెలిపారు. ప్రస్తుత ఆపత్కాలంలో ముడిసరుకుల ధరల పెంపు భారం కస్టమర్లపై పడనివ్వమన్నారు.

ధరలు పెంచాలనుకున్నాం.. కానీ తగ్గిస్తున్నాం..

ధరలు పెంచాలనుకున్నాం.. కానీ తగ్గిస్తున్నాం..

ముడి సరుకు పెరిగినప్పటికీ ఆ ప్రభావం ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లపై పడనివ్వమని గోద్రేజ్ తెలిపింది. ముడి సరుకు ధరలు గత కొన్ని నెలల్లో 30 శాతం పెరిగాయని, దీంతో ధరలు పెంచాలని ఇటీవల నిర్ణయించామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెంపును ఉపసంహరించుకుంటున్నట్లు, ధరలు తగ్గిస్తున్నట్లు గోద్రోజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ సీఈవో సునీల్ తెలిపారు.

ఆన్‌లైన్‌లో పెరిగిన డిమాండ్

ఆన్‌లైన్‌లో పెరిగిన డిమాండ్

కరోనా మహమ్మారి కారణంగా ఆన్ లైన్‌లో సోప్స్, శానిటైజర్స్, చర్మ సంబంధ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. ఇదిలా ఉండగా, కరోనా నుంచి కాపాడుకునేందుకు శానిటైజర్స్, మాస్క్‌ల కొనుగోలుకు తమ ఉద్యోగుల కోసం ప్రభుత్వ రంగ సంస్థ NMDC రూ.1,000 కోట్ల సాయం ప్రకటించింది.

English summary

కరోనా ఎఫెక్ట్: సబ్బుల ధరలు భారీగా తగ్గిస్తున్న కంపెనీలు, 2 కోట్ల సోప్స్ ఉచిత పంపిణీ | Corona outbreak: HUL, Patanjali, Godrej Cut Prices of Soaps

కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకు విక్రయిస్తామని HUL ప్రకటించింది.
Story first published: Sunday, March 22, 2020, 11:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X