ఇండియాలో కరోనా ప్రభావంతో పామాయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతుంది . ఆగస్టులో భారతదేశ పామాయిల్ దిగుమతులు 13.9% తగ్గి 7,34,351 టన్నులకు చేరుకున్నాయని ప్రముఖ వాణిజ్య సంస్థ శుక్రవారం తెలిపింది. హోటళ్ళు మరియు రెస్టారెంట్ల నుండి డిమాండ్ మందగించడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇండియాలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.

గత నెలలో 10.4% తగ్గిన సోయా చమురు దిగుమతులు
దేశంలోని సోయా చమురు దిగుమతులు గత నెలలో 10.4% పడిపోయి 3,94,735 టన్నులకు చేరుకోగా, పొద్దుతిరుగుడు చమురు దిగుమతులు 31% తగ్గి 1,58,518 టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అని , వంట నూనెల తక్కువ కొనుగోళ్లు, మలేషియా పామాయిల్ ధరలు మరియు యు.ఎస్. సోయా ఆయిల్ ధరలపై కాస్త ఒత్తిడిని కలిగిస్తాయి.

హోటల్స్ , రెస్టారెంట్స్ లో బాగా తగ్గిన పామాయిల్ వాడకం
పామాయిల్‌ను ప్రధానంగా హోటళ్ళు మరియు రెస్టారెంట్లు వినియోగిస్తాయి. మార్చిలో దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ విధించిన తరువాత క్రమంగా జూన్ నుండి తిరిగి ప్రారంభమైంది. పామాయిల్ అమ్మకాలు జూలైలో వేగవంతం అయ్యాయి. అయితే ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంలో కరోనావైరస్ కేసులు పెరగడం వల్ల ఆగస్టులో డిమాండ్ బాగా తగ్గింది. భారతదేశం ఇండోనేషియా మరియు మలేషియా నుండి పామాయిల్ మరియు సోయా ఆయిల్ తో పాటు పొద్దుతిరుగుడు నూనె వంటి ఇతర నూనెలను అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్ మరియు రష్యా నుండి కొనుగోలు చేస్తుంది.

14% తగ్గిన పామాయిల్ దిగుమతులు
పామాయిల్ మరియు సోయా ఆయిల్ దిగుమతులు ఆగస్టులో భారతదేశం యొక్క మొత్తం వంట నూనె దిగుమతులను సంవత్సరానికి 14% తగ్గించి 1.37 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. నవంబర్‌లో ప్రారంభమైన 2019-20 మార్కెటింగ్ సంవత్సరంలో మొదటి 10 నెలల్లో, భారతదేశ వంటనూనెల దిగుమతులు 13% తగ్గి 11.2 మిలియన్ టన్నులకు చేరుకున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ప్రస్తుత చమురు సంవత్సరంలో భారీగా తగ్గిన వంట నూనె దిగుమతులు
భారతదేశం యొక్క మొత్తం వంట నూనె దిగుమతులు ప్రస్తుత చమురు సంవత్సరంలో అక్టోబర్ 2020 వరకు 1.4-1.5 మిలియన్ టన్నుల మేర తగ్గాయని చెప్పారు. ఈ సంవత్సరంలో 13.4-13.5 మిలియన్ టన్నులకు పడిపోవచ్చని అంచనా. అంతకుముందు సంవత్సరం మొత్తం 14.9 మిలియన్ టన్నుల కొనుగోళ్లతో పోలిస్తే ఇది తగ్గిందని SEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి. మెహతా చెప్పారు. శుద్ధి చేసిన పామాయిల్ మరియు పామోలిన్ దిగుమతులపై భారత్ జనవరిలో ఆంక్షలు విధించింది . పొరుగు దేశాలైన నేపాల్ మరియు బంగ్లాదేశ్ నుండి శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి చేసుకోవడానికి 39 లైసెన్సులను నిలిపివేసింది.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications