For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cooking Oil Prices: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. లీటరుకు ఎంత తగ్గిందంటే..

|

Cooking Oil Prices: సమయానుకూలంగా ప్రభుత్వ జోక్యంతో వారం రోజులుగా వనస్పతి, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ హోల్‌సేల్, రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ కారణంగా ఇకపై దేశీయ వినియోగదారులు తమ వంటనూనెలకు తక్కువ చెల్లించాలని ఆశించవచ్చని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ బుధవారం అన్నారు.

లీటరుకు రూ.10-15 తగ్గింపు..

లీటరుకు రూ.10-15 తగ్గింపు..

ఈ తరుణంలో దేశంలోని అన్ని ప్రధాన ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్లు ధరలను 10-15 రూపాయలు తగ్గించాయి. తగ్గుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించడంలో సహాయపడతాయని ఆహార ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే అన్నారు. డిపార్ట్‌మెంట్ నిరంతర పర్యవేక్షణ, అన్ని వాటాదారులతో నిరంతరం సమన్వయంతో ప్రభుత్వ జోక్యం కారణంగా ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.

ఫార్చ్యూన్ బ్రాండ్ రేట్లు ఇలా..

ఫార్చ్యూన్ బ్రాండ్ రేట్లు ఇలా..

ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాక్ MRP రూ. 220 నుంచి రూ. 210కి తగ్గింది. సోయాబీన్ (ఫార్చ్యూన్), వేరుశనగ నూనె లీటర్ ప్యాక్‌ల MRP రూ. 205 నుంచి రూ. 195కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో వంటనూనె ధరల్లో తగ్గుదల వచ్చింది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటకల్లో ఫేజ్-1లో 156 సంస్థల్లో, ఫేజ్-2లో 84 సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు జరిపాయి. రాష్ట్రాల్లో రిటైలర్లు, టోకు వ్యాపారులు, పెద్ద చైన్ రిటైలర్లు, ప్రాసెసర్ల వద్ద ఉన్న ఆహార నూనెలు & నూనెగింజల నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

సుంకాలు తగ్గించిన ప్రభుత్వం..

సుంకాలు తగ్గించిన ప్రభుత్వం..

దేశీయంగా పెరుగుతున్న ఎడిబుల్ ఆయిల్ ధరలు, దేశీయ డిమాండ్‌లో సగటు పెరుగుదల, గ్లోబల్ పామ్ ఆయిల్ లభ్యతలో అనిశ్చిత దృష్టిలో ఉంచుకుని ఇది జరిగిందని తెలిపింది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై సుంకాన్ని 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించాయి. శుద్ధి చేసిన పామాయిల్‌పై సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించాయి. సుంకాల తగ్గింపుతో పాటు ఇండోనేషియా ఎగుమతుల నిషేధాన్ని తొలగింపు కారణంగా ప్రజలకు ఉపశమనం లభించింది.

పై చర్యలకు అధనంగా.. పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం అన్ని వస్తువుల ధరలను తగ్గించడంలో మరింత సహాయపడింది. రోజు వారీగా వంటనూనెల ధరల పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

English summary

Cooking Oil Prices: భారీగా తగ్గిన వంటనూనె ధరలు.. లీటరుకు ఎంత తగ్గిందంటే.. | cooking oil prices reduced by 10 to 15 rupees per litre in india

cooking oil prices fell prominantly in india with government appropriate steps at times..
Story first published: Thursday, June 23, 2022, 14:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X