For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగుతున్న ప్రయాణాలు, కానీ బడ్జెట్ మాత్రం పరిమితం!

|

కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు మందగించాయి. అయితే ఇటీవల కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఫెస్టివెల్-20 కన్స్యూమర్ సెంటిమెంట్ స్టడీస్ సర్వేలో భాగంగా 100 మిలియన్లకు పైగా సభ్యులు కలిగిన బహుళ బ్రాండ్ లాయాల్టీ ప్రోగ్రామ్ పేబ్యాక్ డిజిటల్ సర్వే భాగస్వామి యునోమర్‌తో కలిసి మొదటి సర్వేను నిర్వహించింది. ట్రావెల్ లాయలిస్ట్ పైన చేసిన సర్వే ఆధారంగా పునరుజ్జీవం క్రమంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ నుండి రికవరీ కనిపిస్తోంది. విమాన రాకపోకలు పెరగడంతో ఆశాజనకంగా కనిపిస్తోంది. పండుగ నేపథ్యంలో ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తరుచు ట్రావెల్ చేసే వారిపై సర్వే నిర్వహించారు.

విహార యాత్రలకు ప్లాన్.. ఖర్చులు మాత్రం డౌన్

విహార యాత్రలకు ప్లాన్.. ఖర్చులు మాత్రం డౌన్

రాబోయే వారాల్లో 20 శాతం కంటే ఎక్కువమంది విహార యాత్రలను ప్లాన్ చేస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. దక్షిణ, ఉత్తర భారత దేశాల్లో ఇది ఆశాజనకంగా ఉంది. అయితే వేగవంతమైన రికవరీ కనిపించడం లేదు. విహార యాత్రకు ప్లాన్ చేస్తున్నప్పటికీ గత ఏడాది కంటే తక్కువగా ఖర్చులు చేస్తామని 40 శాతం మంది వెల్లడించారు. అంతేకాకుండా సుదూర ప్రయాణాలు, అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రస్తుతానికి ఆసక్తి సన్నగిల్లింది. అన్-లాక్ నుండి డొమెస్టిక్ ట్రావెల్ క్రమంగా పెరుగుతోంది. తాము వీకెండ్ బ్రేక్ తీసుకున్నామని లేదా సొంత ఊళ్ళకు ప్రయాణిస్తున్నామని దాదాపు 40 శాతం మంది తెలిపారు.

సర్వేలో పాల్గొన్నవారు ఏం చెప్పారంటే

సర్వేలో పాల్గొన్నవారు ఏం చెప్పారంటే

పండుగ సీజన్, పోస్ట్ కోవిడ్ ప్రయాణానికి సంబంధించి దాదాపు వెయ్యి మంది మనోభావాలు, ప్రాధాన్యతలు, దృక్పథంపై సర్వే నిర్వహించింది. గత రెండేళ్ళుగా ప్రయాణిస్తున్న వారు, అన్ని మెట్రో నగరాలు సహా 12 పట్టణాల్లో 25-50 ఏళ్ల మధ్య వయస్సు వారు సర్వేలో పాల్గొన్నారు. కొన్ని టైర్ 1 నగరాలను కూడా ఎంచుకున్నారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 40 శాతం మంది తమ గ్రామాలకు ట్రావెల్ చేస్తున్నామని, పండుగ సమయంలో 20 శాతం మంది దక్షిణ, ఉత్తర భారత దేశంలో పర్యటనలకు ప్లాన్ చేస్తున్నట్లు తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో నాలుగో వంతు మంది దేశీయంగా వెకేషన్ ఎంచుకోగా, ఎక్కువగా వారాంతం లేదా సమీప గమ్యస్థానాలను ఎంచుకున్నారు. పురుషులు స్మాల్ వెకేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వగా, మహిళలు లాంగ్ వెకేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.

షార్ట్ హాలీడే వెకేషన్ కోసం సెల్ఫ్ డ్రైవ్ మోడ్

షార్ట్ హాలీడే వెకేషన్ కోసం సెల్ఫ్ డ్రైవ్ మోడ్

మహిళలు షార్ట్ హాలీడే వెకేషన్ కోసం సెల్ఫ్ డ్రైవ్ మోడ్‌ని ఎంచుకున్నారు. 40 శాతం కంటే ఎక్కువమంది కస్టమర్లు గత ఏడాదికంటే తక్కువ ఖర్చు చేస్తామని చెప్పారు. 35 శాతం మంది అదే స్థాయిలో ఖర్చు చేస్తామని, 20 శాతం మంది మాత్రమే గతంలో కంటే ఎక్కువ ఖర్చును చేస్తామని తెలిపారు. ఉత్తరాది తర్వాత దక్షిణాది వారు ఖర్చులు చేస్తామన్నారు. సంప్రదాయ ట్రావెల్ ఏజెంట్లకు బదులు ఆన్ లైన్ ప్లాట్‌ఫాం బుకింగ్ వైపు మూడింట రెండొంతుల మంది మొగ్గు చూపుతున్నారు. 60 శాతం మంది హోటల్స్‌ను బుక్ చేసుకున్నారు లేదా బుక్ చేసుకోవాలని భావిస్తున్నారు.

English summary

పెరుగుతున్న ప్రయాణాలు, కానీ బడ్జెట్ మాత్రం పరిమితం! | Consumer sentiment upbeat on domestic travel

The survey found that more than 20% of people plan vacation trips in the coming weeks. Consumer sentiment upbeat on domestic travel, but constrained by budgets.
Story first published: Wednesday, October 28, 2020, 19:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X