For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకాకోలా, పెప్సీలకు సుడాన్ కష్టాలు.. ఆ చెట్లే కీలకం..?

|

Coca Cola-Pepsi: ప్రపంచ వ్యాప్తంగా కోకాకోలా, పెప్సీ కంపెనీల శీతలపానీయ ఉత్పత్తులు చాలా ప్రాచుర్యం పొందాయి. ఎన్ని స్థానిక ఉత్పత్తులు ఉన్నప్పటికీ ఈ రెండు కంపెనీల హవా మాత్రం తగ్గటం లేదు. ఈ కంపెనీల వ్యాపారానికి సంబంధించి చరిత్ర పుటల్లో చాలా పేజీలు ఉన్నాయి.

అయితే ఈ ప్రపంచ దిగ్గజ కంపెనీలు సుడాన్ దేశంలోని వివాదం కారణంగా ప్రభావితం అవుతున్నాయి. గమ్ అరబిక్ సరఫరా కొరతను అధిగమించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇది అత్యంత డిమాండ్ ఉన్న ఉత్పత్తి. కూల్ డ్రింక్స్, కాస్మెటిక్స్, మిఠాయిలు వంటి వాటి తయారీలో ఇది చాలా ముఖ్యమైన మూలపదార్ధంగా ఉంది. అందుకే 1990ల నుంచి గమ్ అరబిక్ అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపబడింది.

 Coca Cola, Pepsi

గమ్ అరబిక్ అకాసియా చెట్ల నుంచి లభిస్తుంది. ప్రపంచంలో 70 శాతం గమ్ అరబిక్ సరఫరా ఆఫ్రికాలోని సూడాన్ సాహెల్ ప్రాంతం నుంచి ఎగుమతి జరుగుతుంటుంది. ఇది శీతలపానీయాల్లో మూలకాలను కలిపి ఉంచేందుకు దోహదపడుతుంది. రానున్న 6 నెలల్లో గమ్ అరబిక్ లభ్యత ఇబ్బందికరంగా మారుతుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

 Coca Cola, Pepsi

సుడాన్ లో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయో తెలియక కొనుగోలుదారులు, విక్రయదారులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గమ్ అరబిక్ కొనుగోలుకు కంపెనీలు ప్రత్యామ్నాయ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గమ్ అరబిక్ లేకుండా పెప్సీ, కోక్ వంటి కంపెనీలు ఫార్ములేషన్స్ చేయలేవని గ్లోబల్ టాప్-టెన్ సప్లయర్ అయిన అగ్రిగమ్ డైరెక్టర్ డాని హద్దాద్ వెల్లడించారు. ఇది పరోక్షంగా రానున్న కాలంలో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

కోకాకోలా, పెప్సీలకు సుడాన్ కష్టాలు.. ఆ చెట్లే కీలకం..? | Conflicts in Sudan impacting beverage jaints Coca Cola, Pepsi as key ingradient shortage

Conflicts in Sudan impacting beverage jaints Coca Cola, Pepsi as key ingradient shortage
Story first published: Monday, May 8, 2023, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X