ప్రభుత్వ పెద్దల అకస్మాత్తు నిర్ణయాలకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడటం అనేక సార్లు చూశాం. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు దేశమంతా ఏటీఎం ల వద్ద క్యూ కట్టింది. అనకొండ లాంటి లైనులో నిలబడ్డ వారు నిలబడినట్లే నేలకూలిన దాఖలాలు ఎన్నో! అలాగే జీఎస్టీ ని ఆదరాబాదరాగా తీసుకొచ్చి వ్యాపారులను ఇబ్బందులకు గురిచేశారు. దాంతో అన్ని వస్తువుల, సేవల ధరలు తగ్గుతాయని ప్రవచనాలు పలికారు. కానీ నిజమేమిటో అందరమూ చూశాం. సరిగ్గా అలాగే... కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎక్కడి వారు అక్కడే ఉండాలని అత్యవసర లాక్ డౌన్ విధించారు.
దీంతో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది రోజువారీ కూలీలు. వలస కార్మికులే. అప్పటి వరకు పనిచేసిన చోట పని దొరకక... తినడానికి తిండి లేక, ఉండటానికి చోటు లేక వలస కార్మికులు పడిన యాతన అంతా ... ఇంతా కాదు. సొంత ఊర్లకు వెళ్ళిపోయి... కలో గంజో తాగుదాం అనుకున్న వారికి పోలీసులు చుక్కలు చూపించారు. ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని నరకయాతన పెట్టారు. అయినా సరే వందల మైళ్ళ దూరంలోని తమ సొంత ఊళ్లకు తట్టా బుట్ట సర్దుకుని, పిల్లలను చంకన వేసుకుని వారు హైవేల్లో వెళుతుంటే చలించిన గుండెలు ఎన్నో... ఆగిపోయిన హృదయాలు ఎన్నో!

అంతా రివర్స్...
ప్రభుత్వం చెప్పింది కదా అని అప్పుడేమో దయ చూపకుండా వలస కార్మికులను తరిమేసిన యాజమాన్యాలు.... ఇప్పుడేమో పని చేసే వారు దొరకక మళ్ళీ వాల్లనే బ్రతిమిట్లాడిల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ ఎత్తేశారు. ఫ్యాక్టరీలు మొదలయ్యాయి. కానీ అందులో పనిచేసే వారే కరువవుతున్నారు. దీంతో మళ్ళీ వలస కార్మికులను రప్పించేందుకు యాజమాన్యాలు చేయని ప్రయత్నమంటూ లేదు. తమ కంపెనీలు నడవాలంటే వారు ఉండాల్సిందేనన్న సత్యాన్ని గుర్తించిన కంపెనీలు ఇప్పుడు వలస కార్మికులకు వరాలు గుప్పిస్తున్నాయి. ఉచిత భోజన వసతి, బీమా రక్షణ, పిల్లల చదువుల కోసం సహాయం, రవాణా కోసం వాహనాలు, ఉండటానికి ఉచిత ఇండ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

అక్కడి వారే ఎక్కువ...
తెలంగాణ లో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వేలాది పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది కార్మికులు వలస వచ్చిన వారే. ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒరిస్సా వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. వారి సగటు వేతనం నెలకు రూ 6,000 నుంచి రూ 8,000 మధ్య లభిస్తుంది. అందులోనే అన్నీ సమకూర్చుకోవాలి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సొంత ఊర్లకు వెళ్లిన వాళ్ళను రప్పించేందుకు ఫ్యాక్టరీలు ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. బస్సులు, రైళ్లతో పాటు విమానాల్లో వారిని తీసుకొచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. ఎందుకంటే పనివారు లేనిదే ఫ్యాక్టరీలు నడపలేరు. అది నడవకపోతే వీరి పని అంతే.

పెరిగిన వ్యయాలు..
గతంలో ఐతే పైన పేర్కొన్నట్లు నెలకు సుమారు రూ 10,000 లోపు వ్యయంతో ఒక వలస కార్మికుడిని పనిలో పెట్టుకునే వారు. కానీ, ప్రస్తుతం వారికి ఒక్క వేతనం ఇస్తే సరిపోదు. కూడూ, గూడూ ఏర్పాటు బాధ్యత కూడా యాజమాన్యాల మీదే పడింది. అలాగే వేతనాల్లోనూ కనీసం 25% పెరుగుదల నమోదయ్యింది. దీంతో కంపెనీలు, ఫ్యాక్టరీలకు ఆ మేరకు ఖర్చులు పెరిగిపోయాయి. అవి ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కూడా దారితీస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో స్థానికంగా ఉండే కార్మికులకు కూడా ఇక్కడి కంపెనీల్లో పనిచేసే నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారిని కూడా పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో కొంత సమతుల్యత లభిస్తుందని భావిస్తున్నారు. నిజమే ఎక్కడి వారికి అక్కడే ఉపాధి దొరికితే ఎవరికైనా వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి?
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications