For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. నెల ప్రారంభంలో తగ్గిన గ్యాస్ ధరలు.. మారిన రేట్లు..

|

LPG Cylinder Prices: ప్రతి నెల మెుదటి రోజున ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. అయితే ఈ సారి కూడా ధరలను కొంతమేర తగ్గిస్తూ కంపెనీలు ఊరటను ప్రకటించాయి. ద్రవ్యోల్పణంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు ఇది కొంత ఊరటను ఇచ్చే అంశంగా చెప్పుకోవాలి.

గ్యాస్ ధరల్లో మార్పులు..

గ్యాస్ ధరల్లో మార్పులు..

సెప్టెంబరు 1న ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు మరోమారు తగ్గించారు. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలో ఏకంగా రూ.100 తగ్గింపును ప్రకటించాయి. అయితే.. ఈ ధర తగ్గింపు కేవలం వాణిజ్య సిలిండర్లపై మాత్రమే జరిగింది. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల విషయంలో పాత ధరలనే కొనసాగిస్తున్నట్లు కంపెనీలు స్పష్టం చేశాయి.

దేశంలోని నగరాల్లో తగ్గింపు ఇలా..

దేశంలోని నగరాల్లో తగ్గింపు ఇలా..

సెప్టెంబర్ 1 నుంచి ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఇండేన్ సిలిండర్ ధర రూ.91.50, కోల్‌కతాలో రూ.100, ముంబైలో రూ.92.50, చెన్నైలో రూ.96 తగ్గించినట్లు కంపెనీ వెల్లడించింది. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపు కారణంగా హోటల్ పరిశ్రమకు కొంత ఊరట లభించనుంది. ఈ తగ్గింపు వినియోగదారులకు, ఆహార ప్రియులకు కొంత భారాన్ని తగ్గిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

తగ్గింపు తర్వాత రేట్లు..

తగ్గింపు తర్వాత రేట్లు..

ఈ రోజు చమురు కంపెనీలు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో.. ఢిల్లీలో 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,976.50 నుంచి రూ.1,885కి తగ్గింది. అదే సమయంలో కోల్‌కతాలో ధరలు రూ.1,995.5కి చేరింది. గతంలో ఇది రూ.2,095గా ఉంది. ముంబైలో సిలిండర్ ధర రూ.1,844కి తగ్గింది.

గృహ వినియోగదారులకు నిరాశ..

గృహ వినియోగదారులకు నిరాశ..

జూలై 6 నుంచి డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే.. సిలిండర్ ధర ఇప్పటికీ అప్పటి రేటుకే అందుబాటులో ఉంటుంది. ఇండేన్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,053, కోల్‌కతాలో రూ.1,079, ముంబైలో రూ.1,052, చెన్నైలో రూ.1,068గా కొనసాగుతున్నాయి.

గతంలో తగ్గింపులు ఇలా..

గతంలో తగ్గింపులు ఇలా..

ఆగస్టులో కూడా కమర్షియల్ సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించారు. అప్పట్లో సిలిండర్ కు రూ.36 తగ్గింపును కంపెనీలు ప్రకటించాయి. జూలైలో సిలిండర్ పై ధర రూ.9 మేర తగ్గింది. అంతకుముందు.. జూన్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ.198 తగ్గింది. మెుత్తంగా జూన్ నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్ ధర రూ.478 తగ్గింది.

English summary

LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. నెల ప్రారంభంలో తగ్గిన గ్యాస్ ధరలు.. మారిన రేట్లు.. | commercial gas cylinder rates reduced by 100 rs from september 1st know details

gas cylinder rates reduced slightly know details of various cities
Story first published: Thursday, September 1, 2022, 9:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X