For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్షా 60వేల మంది ఉద్యోగులకు కాగ్నిజెంట్ బంపరాఫర్, బోనస్, ప్రమోషన్లు

|

న్యూఢిల్లీ: ఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. 24,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు ఉద్యోగులందరికీ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ బోనస్ 2019లో చెల్లించిన బోనస్ కంటే ఎక్కువ ఉంటుందని తెలిపింది. వీటికి తోడు సీనియర్ అసోసియేట్స్, అంతకంటే కిందిస్థాయి ఉద్యోగులకు ఇక నుండి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ క్వార్టర్ నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. నిపుణులైన ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారకుండా ఉండేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

GST పరిధిలోకి వస్తే పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.68! కానీ నేతలు సిద్ధంగా లేరుGST పరిధిలోకి వస్తే పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.68! కానీ నేతలు సిద్ధంగా లేరు

24వేలమందికి ప్రమోషన్, ఉద్యోగులకు బోనస్

24వేలమందికి ప్రమోషన్, ఉద్యోగులకు బోనస్

దేశవ్యాప్తంగా 24వేల మందికి ప్రమోషన్లతో పాటు ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ తెలిపారు. సీనియర్ అసోసియేట్స్, అంతకంటే కింది స్థాయి ఉద్యోగులకు ప్రతి మూడు నెలలకు ఓసారి ప్రమోషన్ ఇవ్వనున్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు. 2021 జూన్ త్రైమాసికం నుండి అమల్లోకి రానుండటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షా అరవై వేల మంది ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు రాజేష్ నంబియార్ తెలిపారు.

కాగ్నిజెంట్ ఆదాయం

కాగ్నిజెంట్ ఆదాయం

కాగ్నిజెంట్ డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 4,184 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కరెన్సీపరంగా ఇది వార్షిక ప్రాతిపదికన మూడు శాతం క్షీణించింది. దేశంలో 2.9 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది 2020 మూడో త్రైమాసికం ముగింపు నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,89,500. సంస్థ ఆట్రిషన్ 19 శాతంగా ఉంది.

పనితీరు ఆధారిత వేతనం

పనితీరు ఆధారిత వేతనం

ఈ ఏడాది కాగ్నిజెంట్ 1.60 లక్షల మంది ఉద్యోగులకు పనితీరు ఆధారిత వేతన పెంపును అమలు చేసింది. టాప్ పర్ఫార్మర్స్‌కు 125 శాతం వరకు టార్గెట్ బోనస్ ఉండనుంది. డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ ఆట్రిషన్ 16 శాతంగా ఉంది. ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే ఇది ఎక్కువ.

English summary

లక్షా 60వేల మంది ఉద్యోగులకు కాగ్నిజెంట్ బంపరాఫర్, బోనస్, ప్రమోషన్లు | Cognizant announces substantially higher bonus, promotes 24000 employees

IT services major Cognizant on Thursday said it is offering bonuses that are "substantially higher than 2019" and has promoted more than 24,000 employees across levels.
Story first published: Friday, March 5, 2021, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X