For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాక్సిస్ బ్యాంకు చేతికి సిటీ బ్యాంకు..? చివరిదశలో చర్చలు, విలువ ఎంతంటే..

|

ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. తన బ్యాంకింగ్ లావాదేవీలను విస్తరించే పనిలో ఉంది. మరో ప్రైవేట్ బ్యాంకు సిటీ గ్రూప్ రిటైల్ బిజినెస్ కొనుగోలు చేసే పనిలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. రెండు, మూడురోజుల్లో డీల్ కంప్లీట్ కానుంది. ఈ ఒప్పందం విలువ 2.5 బిలియన్ డాలర్లు (రూ.18,750 కోట్లు)గా ఉండనుంది. అంటే చర్చలు జరుగుతున్నాయి.. విలువ పెరగొచ్చే.. తగ్గే అవకాశం ఉంది.

ఒప్పందానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్స్ వచ్చాక డిటైల్స్‌‌‌‌ను యాక్సిస్ బ్యాంక్ ప్రకటించనుంది. అగ్రిమెంట్ ప్రకారం 2 బిలియన్ డాలర్లను క్యాష్‌‌‌‌గా యాక్సిస్‌‌‌‌ బ్యాంక్ చెల్లించనుంది. సిటీ గ్రూప్‌‌‌‌ రిటైల్ బిజినెస్‌‌‌‌ కోసం టాప్ బ్యాంకులు పోటీ పడగా, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌ డీల్‌‌‌‌ను కుదుర్చుకోగలిగింది. దేశంలో సిటీ గ్రూప్ ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీని ఆఫర్ చేయడం వంటి అంశాలలో మిగిలిన బ్యాంకులతో పోలిస్తే యాక్సిస్ బ్యాంక్ ముందుందని అన్నారు.

city bank group to merge to axis bank soon

డీల్ పూర్తయ్యాక యాక్సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లో సిటీ గ్రూప్‌‌‌‌ రిటైల్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ను మెర్జ్‌‌‌‌ చేయడానికి కనీసం ఆరు నెలల సమయం‌‌ పడుతుందని అంచనా వేస్తున్నారు. డీల్ చివరి దశలో ఉన్నప్పటికీ, అగ్రిమెంట్‌‌‌‌ క్యాన్సిల్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్‌‌‌‌, సిటీ గ్రూప్‌‌‌‌ ప్రతినిధులు ఈ అంశంపై కామెంట్ చేయడానికి నిరాకరించారు. మొత్తం 13 దేశాల్లో రిటైల్ బిజినెస్‌‌‌‌ను అమ్మేస్తామని సిటీ గ్రూప్‌‌‌‌ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. సిటీ గ్రూప్ వెల్త్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ వంటి బిజినెస్‌ కొనసాగిస్తుంది. కేవలం రిటైల్ బిజినెస్‌‌‌‌లను మాత్రమే విక్రయిస్తోంది. దానికి సంబంధించి యాక్సిస్ బ్యాంకు ముందుకు వచ్చి చర్చలు జరుపుతుంది.

సిటీ బ్యాంకు తీసుకోవడానికి మిగతా బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. అయితే ఒప్పందం విలువ, ఉద్యోగుల భద్రతకు సంబంధించి చర్చలు ఆశాజనకంగా జరగలేదు. దీంతో అర్ధాంతరంగా డిస్కషన్స్ ముగిశాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఉద్యోగులకు తగిన భద్రత కల్పిస్తామని... జాబ్ నుంచి తీసివేయమని స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది.

English summary

యాక్సిస్ బ్యాంకు చేతికి సిటీ బ్యాంకు..? చివరిదశలో చర్చలు, విలువ ఎంతంటే.. | city bank group to merge to axis bank soon

city bank group to merge to axis bank soon. two bank groups are discussions going on. deal value is 18,750 crores.
Story first published: Tuesday, February 15, 2022, 18:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X