For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Axis Bank చేతికి Citi Bank భారత వ్యాపారం.. మ్యూచువల్ ఫండ్ వ్యాపారంపై సెబీ చర్యలు..

|

Axis Bank: భారతదేశంలో సిటీ బ్యాంక్ నిర్వహిస్తున్న వినియోగదారుల వ్యాపారాన్ని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ చేజిక్కించుకుంది. ఇందుకోసం గత ఏడాది మార్చిలో చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.

వ్యాపార విక్రయం ఎందుకు..

వ్యాపార విక్రయం ఎందుకు..

అమెరికాకు చెందిన సిటీ బ్యాంగ్ గ్రూప్ మన దేశంలో క్రెడిట్ కార్డ్‌లు, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రిటైల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది. 2021లో సిటీ గ్రూప్ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా భారత్‌తో సహా 13 దేశాల్లో రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ తో డీల్ జరిగింది.

కస్టమర్లపై ప్రభావం..

కస్టమర్లపై ప్రభావం..

సిటీ బ్యాంక్ కస్టమర్లకు నెమ్మదిగా యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నారు. ఈ క్రమంలో ఇకపై యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలను సిటీ ఖాతాదారులు వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పరిష్కారం కాని క్రెడిట్ కార్డు వివాదాలు ఉన్నట్లయితే అవి తేలటానికి మరింత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. రుణాలు, బీమా పాలసీల విషయంలో షరతులు, నిబంధనల్లో పెద్దగా మార్పులు రావని తెలుస్తోంది. ప్రస్తుతం సిటీ ఖాతాదారులు తమ చెక్కులను, కార్టులను యథాతథంగా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.

సెబీ చర్యలు..

సెబీ చర్యలు..

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్ రన్నింగ్ కేసులో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు చేపట్టింది. తప్పుడు పద్ధతులను వినియోగించటం ద్వారా రూ.30.5 కోట్లను నిందితులు సంపాదించారని సెబీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మాజీ చీఫ్ డీలర్ వీరేష్ జోషితో పాటు మరో 19 మందిని స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేసేందుకు అనర్హులుగా పేర్కొంటూ వేటు వేసింది. కరోనా మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితిని జోషి దుర్వినియోగం చేశారని సెబీ తన పరిశోధనలో గమనించింది.

English summary

Axis Bank చేతికి Citi Bank భారత వ్యాపారం.. మ్యూచువల్ ఫండ్ వ్యాపారంపై సెబీ చర్యలు.. | Citi bank's indian consumer business comes under axis bank control, SEBI action

Citi groups indian consumer business comes under axis bank control, SEBI action
Story first published: Wednesday, March 1, 2023, 10:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X