For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరిహద్దులో టెన్షన్: ఈ భారతీయ కంపెనీల్లో చైనీస్ పెట్టుబడులు, మరి ఇప్పుడు?

|

చైనా హద్దులు దాటి భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇరువైపులా సైన్యం చనిపోయింది. మన దేశానికి చెందిన 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ సమయంలో చాలామంది భారతీయులు, వ్యాపారులు, సంస్థలు చైనా వస్తువులను బహిష్కరిద్దామంటూ నినదిస్తున్నారు. సమీప భవిష్యత్తులో అది సాధ్యం కాకపోయినప్పటికీ... ఆత్మనిర్భరం భారత్‍‌లో భాగంగా క్రమంగా చైనాపై ఆధారపడటం తగ్గించవచ్చు. హఠాత్తుగా తగ్గించే పరిస్థితి లేదని కొంతమంది భావిస్తున్నారు. చైనా నుండి మన దేశానికి చెందిన వివిధ సంస్థల్లోకి పెద్దఎత్తున పెట్టుబడులు కూడా వచ్చాయి.

సరిహద్దులో ఉద్రిక్తత: చైనా నుండి ఇండియా కంపెనీల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు

ఈ సంస్థల్లో చైనా కంపెనీల పెట్టుబడులు

ఈ సంస్థల్లో చైనా కంపెనీల పెట్టుబడులు

భారత్ ఆర్థిక వ్యవస్థలోకి చైనా పెట్టుబడులు, చైనా వస్తువులు వేగంగా విస్తరించాయి. మౌలిక సదుపాయాలు మొదలు హైటెక్ పెట్టుబడుల వరకు ఉన్నాయి. అధికారిక డేటా ప్రకారం గత ఆరేళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 20 శాతం పెరిగింది. వివిధ సంస్థల్లోకి చైనా పెట్టుబడులు వచ్చాయి. రైడ్ హెయిలింగ్ సంస్థ ఓలా, ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లలో చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. గత మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్య సగటు రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.

గత ఏడాది తగ్గిన ద్వైపాక్షిక వాణిజ్యం

గత ఏడాది తగ్గిన ద్వైపాక్షిక వాణిజ్యం

వాణిజ్య మంత్రిత్వ గణాంకాల ప్రకారం 2019లో ద్వైపాక్షిక వాణిజ్యం వ్యాల్యూ 80 బిలియన్ డాలర్లు. చైనా కస్టమ్స్ డిపార్టుమెంట్ డేటా ప్రకారం 2019 జనవరి నుండి నవంబర్ వరకు 84.3 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ద్వైపాక్షిక వాణిజ్యం 95.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది గత ఏడాది 3.2 శాతం తగ్గింది. చైనా-భారత్‌లు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కానీ ఇండియా వాణిజ్య లోటు ఎక్కువ.

భారత్‌కు దిగుమతులు ఎక్కువ

భారత్‌కు దిగుమతులు ఎక్కువ

వ్యాల్యూ టర్మ్స్‌లో చైనా నుండి ఎక్కువగా భారత్‌కు దిగుమతులు అవుతాయి. చైనాకు భారత్ నుండి ఎగుమతులు తక్కువ. భారత్ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 16 శాతం. అదే సమయంలో భారత్ మొత్తం ఎగుమతుల్లో చైనాకు వెళ్లేవి కేవలం 3.2 శాతం మాత్రమే. ఈ వాణిజ్య అసమతుల్యత భారత్‌కు ప్రతికూలత.

వివిధ ఇండియా కంపెనీల్లో పెట్టుబడులు

వివిధ ఇండియా కంపెనీల్లో పెట్టుబడులు

ఇండియా టెక్నాలజీ సెక్టార్‌లో చైనా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చైనా టెక్ సంస్థలు ఇండియాలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయని ఎఫ్‌డీఐ ఇంటెలిజెన్స్ డేటా చెబుతోంది. 2019లో చైనా 19 ఇన్‌బౌండ్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేశాయి. చైనా ఇన్వెస్ట్ చేసింది ఇండియాలోనే ఎక్కువ. ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న రష్యాలో కేవలం ఎనిమిదింటిలోనే ఇన్వెస్ట్ చేశాయి. మూడింట రెండువంతుల యూనీకార్న్ ఇండియన్ స్టార్టప్స్‌కు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చి ఉంటాయి.

2018లో అలీబాబా ఆన్‌లైన్ కిరాణా మార్కెట్ బిగ్ బాస్కెట్‌లో 216 మిలియన్ డాలర్లు, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో 210 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. టెన్సెంట్ రైడ్ హెయిలింగ్ యాప్ ఓలాలో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అంతకుముందు 2017లోనే 700 మిలియన్ డాలర్లు ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టింది. అప్పుడు అతిపెద్ద టెక్ పెట్టుబడిగా ఇది నిలిచింది. పేటీఎంలో అలీబాబా, బైజూస్‌లో టెన్సెంట్ పెట్టుబడులు పెట్టాయి.

ఎగుమతులు, దిగుమతులు

ఎగుమతులు, దిగుమతులు

పత్తి, నూలు, సేంద్రియ రసాయనాలు, ఖనిజాలు, సహజ ముత్యాలు, విలువైన రాళ్లు, బట్టలు వంటి వాటిని చైనాకు భారత్ ఎగుమతి చేస్తుంది. ఎలక్ట్రిక్ మిషినరీ, ఎలక్ట్రానిక్ వస్తువులు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్స్, సోలార్ ఎనర్జీ కాంపోనెంట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (API) వంటి వాటిని చైనా నుండి మనం దిగుమతి చేసుకుంటాం. చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై మనం దృష్టి పెట్టే అవకాశముందని, కానీ ఇప్పటికిప్పుడు బహిష్కరణ ప్రభావం కనిపించకపోవచ్చునని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎకనమిస్ట్ గీతాంజలి నటరాజ్ అన్నారు. ఇరుదేశాల మధ్య ట్రస్ట్ డెఫిసిట్ (నమ్మకం లోటు) కనిపిస్తోందన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం భారత్‌తో సరిహద్దు పంచుకునే దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టినప్పుడు కచ్చితంగా వెల్లడించే కొత్త నిబంధనలు తీసుకు వచ్చాయి. చైనా అవకాశవాద పెట్టుబడులు నిరోధించేందుకు ఇది ఉపయోగపడుతుందని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ బోధకులు, వాణిజ్య శాఖ మాజీ సలహాదారు బిశ్వజిత్ ధర్ అన్నారు. ఇలాగే వెళ్తే చైనాతో పాటు ఏ ఇతర దేశంపై ఎక్కువగా ఆధారపడే అంశాన్ని భారత్ తగ్గించుకుంటుందని చెప్పారు. హెల్త్ సెక్టార్ విషయంలోను చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్నామన్నారు.

English summary

China big investments in these indian companies

According to data from the commerce ministry, India’s bilateral trade with China was worth nearly $80 billion in 2019. Data posted on India’s Beijing embassy website, which it sourced to China’s customs department, showed total bilateral trade between Jan and Nov 2019 at $84.3 billion, a drop of nearly 3.2% from the previous year’s $ 95.7 billion.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X