For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

bank holidays: మార్చి నెలలో బ్యాంకులకు సెలవు రోజులు

|

మార్చి నెలలో బ్యాంకులు సెలవు రోజుతోనే ప్రారంభమవుతున్నాయి. ఏటీఎం కేంద్రాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని పనుల కోసం మనం బ్యాంకులకు వెళ్లాల్సిందే. లోన్, గోల్డ్ లోన్, లాకర్ వినియోగం సహా ఇతర పనులు కూడా బ్యాంకుకు వెళ్తేనే జరుగుతాయి. అయితే సెలవు రోజున బ్యాంకుకు వెళ్తే ఉట్టి చేతులతో తిరిగి రావాలి. కాబట్టి మార్చి నెలలో ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకోవడం అవసరం.

మార్చి నెలలో బ్యాంకులు మొత్తంగా 13 రోజులు వర్క్ చేయవు. ఆయా రాష్ట్రాలను, ఆయా రాష్ట్రాల పండుగలను బట్టి సెలవు రోజులు ఉంటాయి. మార్చి 1న మహాశివరాత్రి పర్వదినం. అగర్తాలా, ఐజ్వాల్, చెన్నై, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇంపాల్, కోల్‌కతా, షిల్లాంగ్ మినహా దేశమంతా మహాశివరాత్రి సెలవు సందర్భంగా బ్యాంకులు వర్క్ చేయవను. గ్యాంగ్‌టక్‌లో మార్చి 3న లోజర్ సందర్భంగా సెలవు దినం. ఐజ్వాల్‌లో మార్చి 4న చాప్‌చార్ కుట్ సందర్భంగా బ్యాంకులు పని చేయవు.

Check full list of holidays in March 2022

సెలవులు...

March 1 (Tuesday): మహాశివరాత్రి

March 3 (Thursday): సిక్కింలో లోజర్

March 4: (Friday): మిజోరాంలో చాప్‌చార్ కుట్

March 17: Thursday: హోలీ దహన్ సందర్భంగా ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

March 18: (Friday): హోలీ పండుగ సందర్భంగా కర్నాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, త్రిపురలలో బ్యాంకులకు సెలవు.

March 19: (Saturday): మణిపూర్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాల్లో హోలి/యోసాంగ్ సందర్భంగా బ్యాంకులు పని చేయవు.

March 22: (Tuesday): బీహార్ దివస్

వీటితో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు బ్యాంకులు పని చేయవు.

ఆదివారం: March 6, 2022

రెండో శనివారం: March 12, 2022

ఆదివారం: March 13, 2022

ఆదివారం: March 20, 2022

నాలుగో శనివారం: March 26, 2022

ఆదివారం: March 27, 2022

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే...

మార్చి 1 శివరాత్రి, మార్చి 6 ఆదివారం, మార్చి 12 రెండో శనివారం, మార్చి 13 ఆదివారం, మార్చి 18 హోలి, మార్చి 20 ఆదివారం, మార్చి 26 నాలుగో శనివారం, మార్చి 27 ఆదివారం సెలవు రోజులు.

English summary

bank holidays: మార్చి నెలలో బ్యాంకులకు సెలవు రోజులు | Check full list of holidays in March 2022

In the month of March, banks across India will remain shut for as many as 13 days. According to the RBI calendar list, banks across several states will also not be operational on 1 March on the occasion of Maha Shivratri.
Story first published: Tuesday, March 1, 2022, 9:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X