For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాష్ట్రాల తరఫున కేంద్రం అప్పులు, రూ.1.1 లక్షల కోట్ల సమీకరణ

|

జీఎస్టీ పరిహారం చెల్లింపు కోసం కేంద్రం విడతలవారీగా రుణాలు తీసుకొని ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. స్పెషల్ విండో ఏర్పాటు చేస్తున్నందుకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు కిందకు రాదని తెలిపింది. ఆప్షన్ 1 కింద రాష్ట్రాలకు రూ.1.10 లక్షల కోట్ల రుణం అందించేందుకు స్పెషల్ విండో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

జీఎశ్డీపీలో 0.5 శాతం రుణాలు తీసుకోవడానికి ఇటీవల వీటికి అనుమతి ఇవ్వగా, అదనంగా ఈ మొత్తం సమకూరుస్తామని తెలిపింది. కరోనా కారణంగా ఆర్థిక వనరులు కోల్పోయిన రాష్ట్రాలకు రెండు శాతం మేర అధనపు రుణాలు సేకరించేందుకు సంస్కరణ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చామని, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో రుణాలు ఉపయోగించుకోలేకపోతే మరుసటి ఏడాది ఉపయోగించుకునేలా ఆప్షన్ 1 రాష్ట్రాలకు అదనపు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.

Centre offers to borrow Rs 1.1 lakh crore and lend to states

కేంద్రం ఇచ్చే రుణం రాష్ట్రాల మూలధన ఆదాయ పద్దుల్లో కనిపిస్తుందని, ఆర్థిక లోటు భర్తీ కింద ఈ మొత్తం వచ్చినట్లుగా ఉంటుందని వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో రుణ సేకరణకు వెళ్లినప్పుడు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వడ్డి ఉంటుందని, ఇప్పుడు కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల ఆ తేడా ఉండదని తెలిపింది. అయితే, వడ్డీ, అసలు ఎవరు చెల్లిస్తారనే అంశాన్ని తెలియజేయాల్సి ఉంది.

English summary

రాష్ట్రాల తరఫున కేంద్రం అప్పులు, రూ.1.1 లక్షల కోట్ల సమీకరణ | Centre offers to borrow Rs 1.1 lakh crore and lend to states

The Centre will borrow the GST compensation shortfall of Rs 1.1 lakh crore, if all the states choose that option, and pass the amount on to them, marking a dramatic shift in stand that should resolve the row over the matter. The expectation is that the conciliatory move will bring the opposition-ruled states round.
Story first published: Friday, October 16, 2020, 18:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X