For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్-పాన్ కార్డు లింకేజీ..ఇక నో టెన్షన్

|

న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్.. ప్రతి చోటా దీని అవసరం ఏర్పడింది. ఆర్థిక లావాదేవీలకు మాత్రమే కాదు.. రోజువారీ చర్యల్లోనూ ఈ ఆధార్డ్ కార్డ్ తప్పనిసరిగా మారింది. ఆధార్ కార్డ్ లేనిదే వ్యాక్సిన్ కూడా వేయించుకోలేని పరిస్థితి ఉంది. ఇక బ్యాంకింగ్ సెక్టార్‌లో ఈ కార్డ్ లేనిదే ఏ పనీ చేయలేం. ఇదే లైన్‌లో పాన్ కార్డ్ కూడా చేరింది. ఆర్థిక లావాదేవీల విషయంలో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డ్ తప్పనిసరిగా మారింది.

GST Council: ఆ బాధ్యత ఇకపై స్విగ్గి, జొమాటోలదేGST Council: ఆ బాధ్యత ఇకపై స్విగ్గి, జొమాటోలదే

డీ మ్యాట్ సహా బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న ఖాతాదారులు ఆధార్-పాన్ కార్డుల లింక్‌ను కలిగి ఉండాలంటూ రిజర్వుబ్యాంక్ చాలాకాలం కిందటే ఆదేశాలను జారీ చేసింది. దీని మీద కొంత వ్యతిరేకత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ గడువును పొడిగించుకుంటూ వస్తోంది. ఖాతాదారులకు కొంత వెసలుబాటు కల్పించింది. కొత్తగా ఈ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఖాతాదారులకు శుభవార్త ఇచ్చింది.

Central govt extended by 6 months till March 2022 the deadline to link PAN with Aadhaar card

ఇదివరకు ఆధార్‌ కార్డుతో పాన్‌‌తో అనుసంధానం చేయడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉండేది. దీన్ని మరో ఆరు నెలల వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్ కార్డ్-పాన్ కార్డ్ లింకేజీ గడువును పొడిగించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ పొడిగింపు ప్రకారం.. బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను తెరవ దలిచిన వారు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్..జిరాక్స్ ప్రతులను అందించితే సరిపోతుంది.

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్-పాన్ కార్డ్ లింకింగ్ వ్యవస్థను సీబీడీటీ పొడిగించినందున అప్పటిదాకా ఈ రెండింటి అనుసంధానం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, ఖాతాదారులు ఎదురుకొంటోన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది.

ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్‌లో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును కూడా ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించినట్లు పేర్కొంది. పాన్‌కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో దాన్ని ఆధార్‌తో లింక్ చేయాలని రిజర్వు బ్యాంక్ ఇదివరకే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఖాతాదారుల నుంచి ఎదురవుతోన్న వ్యతిరేకత నేపథ్యంలో గడువును పొడిగింస్తూ వస్తోంది సీబీడీటీ.

బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి, డీ మ్యాట్ ఓపెన్ చేయడానికీ పాన్ కార్డు అత్యవసరం. 50,000 రూపాయలకు మించిన నగదు లావాదేవీల సమయంలోనూ పాన్‌ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి కూడా ఆధార్-పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి.

English summary

ఆధార్-పాన్ కార్డు లింకేజీ..ఇక నో టెన్షన్ | Central govt extended by 6 months till March 2022 the deadline to link PAN with Aadhaar card

The Central government extended by six months till March 2022 the deadline to link PAN with Aadhaar card.
Story first published: Saturday, September 18, 2021, 11:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X