For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PM Kisan Update: రైతన్నలారా ఈ అవకాశాన్ని మిస్ కాకండి.. రూ.6,000 కావాలంటే ఇదే చివరి ఛాన్స్..!

|

PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సదవకాశాన్ని అందిస్తోంది. రైతులకు అందిస్తున్న PM కిసాన్ యోజన కింద డబ్బు పొందటానికి eKYC తప్పనిసరి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిని పూర్తి చేయని వారికోసం ఈకేవైసీ గడువును ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉండేలా కేంద్రం తాజాగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ గడువు జూలై 31గా ఉంది. ఈ వివరాలను ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలిపింది.

eKYC తప్పనిసరి..

eKYC తప్పనిసరి..

ముఖ్యంగా అర్హులైన లబ్ధిదారులందరూ తమ eKYCని పూర్తి చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గడువును 3 సార్లు పొడిగించింది - జూలై 31, మే 31, మార్చి 31. అయితే PMKISAN పథకం కింద నమోదిత రైతులకు eKYC తప్పనిసరి. దీనికోసం OTP ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీప CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.

PM కిసాన్ యోజన eKYCని ఆన్‌లైన్‌లో ఇలా పూర్తి చేయండి..

PM కిసాన్ యోజన eKYCని ఆన్‌లైన్‌లో ఇలా పూర్తి చేయండి..

Step 1: ముందుగా అధికారిక వెబ్ సైట్ pmkisan.nic.in కి లాగిన్ అవ్వాలి.

Step 2: అందులో Farmers Corner కింద ఉన్న eKYC ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

Step 3: OTP ఆధారిత eKYC కోసం మీ ఆధార్ నంబర్ అందించండి.

Step 4: ఆ తరువాత సెర్చ్ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5: ఆ తరువాత ఆధార్ లింక్ చేయబడిన మెుబైల్ నంబర్ ఎంటర్ చేసి.. Get OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 6: ఆ తరువాత మీ మెుబైల్ కు వచ్చిన ఓటీపీ నంబర్ ఎంటర్ చేయండి.

Step 7: అందించిన వివరాలు పూర్తిగా వెరిఫికేషన్ అయ్యాక eKYC ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రయోజనాలు ఇవే..

ప్రయోజనాలు ఇవే..

PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన లబ్ధిదారు రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో రైతులకు ఈ డబ్బు చెల్లించబడుతుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు ప్రభుత్వం బదిలీ చేస్తుంది.

సందేహాలొస్తే..

సందేహాలొస్తే..

ఈ ప్రక్రియకు సంబంధించి ఏదైనా సందేహం లేదా సహాయం కోసం లబ్ధిదారులు PM-కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 011-24300606, 155261ను సంప్రదించవచ్చు. ఆధార్ OTP సంబంధిత సమస్యల కోసం వారు [email protected]ని కూడా సంప్రదించవచ్చు.

English summary

PM Kisan Update: రైతన్నలారా ఈ అవకాశాన్ని మిస్ కాకండి.. రూ.6,000 కావాలంటే ఇదే చివరి ఛాన్స్..! | central government increased PM Kisan eKYC dead line till august 31, 2022 know details

central government increased PM Kisan eKYC limit know details
Story first published: Friday, August 19, 2022, 7:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X