ముంబై: ప్రముఖ టైర్ల కంపెనీ సియట్ టైర్స్ నుండి సరికొత్త మాస్కులు వచ్చాయి. గోసేఫ్ S95 మాస్క్ పేరుతో వీటిని విడుదల చేసింది. సియట్ రెండు రోజుల క్రితం వీటిని లాంచ్ చేయడం ద్వారా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) బిజినెస్‌లోకి అడుగు పెట్టినట్లు అయింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో వివిధ రంగాల కంపెనీలు వివిధ కారణాలతో రూటు మార్చుతున్నాయి.

సియట్ మాస్క్ ధర రూ.249
సియట్ గోసేఫ్ ఎస్95 మాస్కులు సియట్ షాప్‌లలో, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌తో పాటు వివిధ మార్గాల్లో అందుబాటులోకి వచ్చింది. సియట్ ఎస్95 మాస్క్ ధరను రూ.249గా నిర్ణయించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే పలు ఆటోమొబైల్ పరిశ్రమలో కరోనాపై పోరులో భాగంగా వెంటిలెటర్లు, పీపీఈ కిట్స్ తయారు చేస్తున్నాయి. టీవీఎస్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర ఆటో దిగ్గజాలు ఫేస్‌మాస్కులు, వెంటిలెటర్లు, పీపీఈ కిట్స్‌లో పాలు పంచుకుంటున్నాయి. ఇప్పుడు సియట్ ఆ జాబితాలో చేరింది.

ఆరు వరుసల్లో సియట్ ఎస్95 మాస్క్
సియట్ గోసేఫ్ ఎస్95 మాస్క్ మొత్తం ఆరు వరుసల్లో రక్షణ ఇస్తుంది. దీనిలో లోపల ఒక పొర యాంటీబ్యాక్టీరియల్ వస్త్రంతో తయారు చేశారు. ఆ తర్వాత మూడు పొరలు సూక్ష్మజీవులను పిల్టర్ చేస్తాయి. ఈ మాస్క్‌కు అడ్జస్టబుల్ నోస్‌క్లిప్ కూడా ఉంటుంది. అందరికి సరిపోయేలా డిజైన్ ఉంటుంది. ఈ మాస్క్‌ను దాచుకోవడానికి ఓ బ్యాగ్ కూడా ఉంటుంది. ఇది ప్రత్యేక వస్త్రంతో తయారు చేశారు.

30 సార్లు
సియట్ గోసేఫ్ ఎస్ 95 యాంటీ పొల్యూషన్ ఎస్ 95 మాస్క్‌ను వాష్ చేయవచ్చు. 30 సార్లు మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. సియట్ షాప్స్‌తో పాటు ఈ-కామర్స్ వెబ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, సీనియారిటీ తదితర చోట్ల అందుబాటులో ఉన్నాయి.

సియట్ నుండి మరిన్ని ఉత్పత్తులు
సేఫ్టీ ఫస్ట్ అనే తమ సిద్ధాంతానికి అనుగుణంగా తాము ఈ మాస్క్‌ను తయారు చేశామని సియట్ టైర్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ టోలానీ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత్‌లో ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నంగా దీనిని మార్కెట్లోకి తెచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో గోసేఫ్ రేంజ్‌లో మరిన్ని ఉత్పత్తులు వస్తాయన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications