For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

MakeMy Trip: కండిషన్ల గేమ్ ఆడుతున్నారు..! మేక్ మై ట్రిప్, ఓయో, గోఐబిబోలు చేసేది తప్పు..

|

MakeMy Trip: హోటల్ ఆతిథ్య రంగంలోని సంస్థలపై సీసీఐ కన్నెర్ర చేసింది. మేక్ మై ట్రిప్, ఓయో, గోఐబిబో వంటి భారతీయ స్టార్టప్ కంపెనీలతో పాటు ఇతర ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలపై భారీగా జరమానా విధించింది. ఈ సంస్థలపై ఏకంగా రూ.392 కోట్ల జరిమానా వేసింది.

 జరిమానా ఎంతంటే..?

జరిమానా ఎంతంటే..?

సీసీఐ విధించిన మెుత్తం పెనాల్టీలో రూ.223.48 కోట్లు మేక్ మై ట్రిప్, గోఐబిబోలపై విధించబడింది.ఇదే క్రమంలో హోటల్ రంగంలో సంచలనంగా నిలిచిన స్టార్టప్ ఓయోపై రూ.168 కోట్లను పెనాల్టీ పడింది. భారీ పెనాల్టీల వల్ల కంపెనీలు మరింతగా ప్రభావితం కానున్నాయి.

అగ్రిమెంట్లు..

అగ్రిమెంట్లు..

హాస్పిటాలిటీ పరిశ్రమలో ప్రాచుర్యం పొందిన ఈ కంపెనీలు వ్యాపారంలో భాగంగా అనేక హోటళ్లతో టై అప్ అయ్యాయి. విదేశాల్లోనూ ఓయోతో సహా కంపెనీలు ఒప్పందాలపై సంతకాలు కూడా చేశాయి. ఈ కంపెనీలు తమ సైట్‌లో కాంట్రాక్ట్ హోటళ్లు, హాస్టల్‌ల వివరాలు, ధరలను లిస్టు చేస్తుంటాయి.

 కస్టమర్లను ఆకర్షించేందుకు..

కస్టమర్లను ఆకర్షించేందుకు..

వ్యాపారంలో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు స్టార్టప్ కంపెనీలు రకరకాల ఆఫర్లు ఇస్తున్నాయి. ఇవి పర్యాటకులకు చాలా మంచి వెసులుబాటును అందిస్తున్నాయి. అయితే ఈ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలు తమతో ఒప్పందం కుదుర్చుకున్న హోటళ్లు ఇదే రంగంలోని ఇతర అగ్రిగేటర్లతో లిస్ట్ కాకూడదంటూ షరతులు పెడుతున్నాయి.

అనేక కండిషన్లు..

అనేక కండిషన్లు..

కస్టమర్లు నేరుగా హోటల్ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోకుండా కండిషన్లు ఉన్నాయి. ఈ ఒప్పందం హోటళ్లు, హాస్టళ్ల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. అందువల్ల ఈ ఒప్పందాలను రద్దు చేయడానికి కాంపిటీషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా జరిమానాలు విధించింది. దీనిపై 2019 నుంచి సీసీఐ విచారణ చేపట్టింది. పాత ఒప్పందాల స్థానంలో కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవాలని సీసీఐ నోటిఫై చేసింది. ఫెడరేషన్ ఆఫ్ హోటల్ & రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో ఈ విచారణ మెుదలైంది.

Read more about: cci makemytrip goibibo oyo hotels
English summary

MakeMy Trip: కండిషన్ల గేమ్ ఆడుతున్నారు..! మేక్ మై ట్రిప్, ఓయో, గోఐబిబోలు చేసేది తప్పు.. | CCI Imposed 392 crores penalty on MakeMyTrip, Goibibo and OYO know why

CCI Imposed 392 crores penalty on MakeMyTrip, Goibibo and OYO know why
Story first published: Thursday, October 20, 2022, 16:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X