For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BBC పై ఆదాయపు పున్ను శాఖ సర్వేలో అధికారులు ఏం తేల్చారంటే..

|

IT raids: యూకేకి చెందిన 'బ్రిటీష్ బ్రాడ్‌ కాస్టింగ్ కార్పొరేషన్'పై ఆదాయ పన్ను శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీతో పాటు భారత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా గుజరాత్ అల్లర్లపై ఓ డాక్యుమెంటరీని ఈ సంస్థ ఇటీవల ప్రసారం చేసింది. ఈ తరుణంలో కేవలం రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం BBCపై రైడ్ నిర్వహిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ సర్వే ఫలితాలను అధికారులు ఇవాళ మీడియాకు వెల్లడించారు.

అరవై గంటలపాటు సాగిన సర్వే:

అరవై గంటలపాటు సాగిన సర్వే:

ఢిల్లీ, ముంబై లోని BBC కార్యాలయాల్లో ఆదాయపు పన్ను విభాగం అధికారులు దాదాపు 60 గంటలపాటు సర్వే నిర్వహించారు. మంగళవారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) ప్రతినిధి వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ లో కొన్ని అక్రమ చెల్లింపులను గుర్తించినట్లు శుక్రవారం పేర్కొన్నారు.

 ఆదాయ వ్యయాలు సరిపోలడం లే:

ఆదాయ వ్యయాలు సరిపోలడం లే:

డిజిటల్, పేపర్ రూపంలో ఆధారాలు లభించినట్లు CBDT అధికారులు ప్రకటించారు. ఉద్యోగుల స్టేట్‌ మెంట్‌ లనూ రికార్డు చేసినట్లు చెప్పారు. దేశంలో ఆ సంస్థ కార్యకలాపాలను ఆదాయ, వ్యయాలతో పోల్చిచూస్తే సరిపోలడం లేదని వెల్లడించారు. బదిలీ ధర డాక్యుమెంటేషన్ లోనూ పలు వ్యత్యాసాలు కనుగొన్నట్లు తెలిపారు.

నిజాలను నిర్భయంగా వెలికితీస్తాం:

నిజాలను నిర్భయంగా వెలికితీస్తాం:

సర్వే పూర్తయిన అనంతరం BBC సైతం ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము అధికారులకు పూర్తిగా సహకరించామని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని పేర్కొంది. తమది ఓ స్వతంత్ర, విశ్వసనీయమైన మీడియా సంస్థ అని గుర్తుచేసింది. నిజాలను నిర్భయంగా వెలికితీయడంలో పాత్రికేయులకు అండగా ఉంటామని ప్రకటించింది.

సర్వే vs రైడ్ :

సర్వే vs రైడ్ :

సర్వేకు, రైడ్‌ కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సంబంధిత శాఖ అనుమానించవచ్చు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం లేదని భావించవచ్చు. ఈ సందర్భంలో ఆయా వ్యక్తి/సంస్థను తనిఖీ చేసే అధికారం IT ప్రతినిధులకు ఉంటుంది. కానీ రైడ్ చేయాలంటే తప్పనిసరిగా పక్కా ఆధారాలు ఉండి తీరాల్సిందే. ప్రక్రియ పూర్తయిన అనంతరం అనుమానితుల నుంచి వ్రాతపూర్వక స్టేట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

English summary

BBC పై ఆదాయపు పున్ను శాఖ సర్వేలో అధికారులు ఏం తేల్చారంటే.. | CBDT officials announced IT survey results on BBC

IT Officials on BBC Surveys
Story first published: Friday, February 17, 2023, 22:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X