ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో మరో పీఈ దిగ్గజం కార్లైల్ గ్రూప్ వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14,700 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుందని తెలుస్తోంది. రిలయన్స్, కార్లైల్ కంపెనీల మధ్య చర్చలు సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
దీనిపై ఈ రెండు కంపెనీలు స్పందించాల్సి ఉంది. ఈ డీల్ కుదిరితే దేశీయ కంపెనీలో కార్లైల్ చేయనున్న అతిపెద్ద ఇన్వెస్ట్ కానుంది. దేశీయ రిటైల్ రంగ కంపెనీలో కార్లైల్ తొలిసారి వాటా సొంతం చేసుకున్నట్లు అవుతుంది. ఇటీవల సిల్వర్ లేక్ రిలయన్స్ రిటైల్‌లో రూ.7,500 కోట్లతో 1.75శాతం వాటాని కొనుగోలు చేసింది. రిటైల్ వ్యాల్యూ రూ.4.21 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.

16.5 లక్షల కోట్లకు..
రిలయన్స్ రిటైల్‌లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనే అంచనాల నేపథ్యంలో రిలయన్స్ షేర్లు గత వారం రోజులుగా ఎగిసిపడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం సమయానికి రిలయన్స్ షేర్ 0.17 శాతం ఎగిసిల రూ.2,323 పలికింది. ఎన్ఎస్ఈలో ఓ సమయంలో 2 శాతం ఎగిసింది. ఇది సరికొత్త గరిష్టం. రిలయన్స్ పీపీ షేర్ ధర కూడా 3 శాతం ఎగిసింది. దీంతో రిలయన్స్, పార్టీ పెయిడ్ స్టాక్స్ సరికొత్త రికార్డు రూ.16.5 లక్షల కోట్లకు చేరుకుంది.

రిలయన్స్-రిలయన్స్ పీపీ
నేడు ఉదయం రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ పీపీ షేర్లు ఎగిసిపడ్డాయి. దీంతో ఈ షేర్ ధర ఓ సమయంలో వరుసగా రూ.2,360, రూ.1,461కి చేరుకుంది. దీంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15.8 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్ పీపీ రూ.61 వేల కోట్లకు పైగా ఎగిసింది. ఈ రెండింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16.5 లక్షల కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ రికార్డుల హోరు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 200 బిలియన్ డాలర్లతో ఈ ఈ రికార్డ్ అందుకున్న తొలి భారతీయ కంపెనీగా నిలిచిన విషయం తెలిసిందే. గత వారం రూ.15 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ నెల 10వ తేదీన 200 బిలియన్ డాలర్ల ఎం-క్యాప్‌తో రిలయన్స్ దేశంలో ఈ రికార్డ్ సాధించిన తొలి సంస్థగా నిలవడంతో పాటు వ్యాల్యూపరంగా ప్రపంచంలో 44వ స్థానంలో నిలిచింది. క్రితం వారం రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.2.50 లక్షల కోట్లు పెరిగింది. ఏజెన్సీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ బైరేటింగ్ ధరను గత వారం రూ.2250గా అంచనా వేయగా, ఇప్పటికే ఈ ధరను దాటేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications