న్యూఢిల్లీ: కెయిర్న్ ఎనర్జీ విదేశాల్లోని భారత ఆస్తులను గుర్తించే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుకు లోబడి తమకు 140 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని లేదంటే విదేశాల్లోని భారత బ్యాంకు ఖాతాలు, విమానాలు, నౌకలు తదితర ఆస్తులు జఫ్తు చేసుకొని వసూలు చేసుకుంటామని భారత్‌ను బ్రిటన్ సంస్థ అయిన కెయిర్న్ గట్టిగా హెచ్చరించింది. పరిహారం చెల్లింపులో విఫలమైతే జఫ్తు చేసుకునేందుకు అనువైన భారత విదేశీ ఆస్తులపై ఇప్పటికే ఆరా తీసినట్లు తెలిపింది.

ఈ తీర్పును అమలు చేయాలి
లండన్‌లోని భారత హైకమిషన్‌కు ఈ నెల 22వ తేదీన ఈ మేరకు కెయిర్న్ సీఈవో లేఖ రాశారు. ఈ లేఖ కాపీలను ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రులకి కూడా పంపించారు. ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు అంతిమమని, విధిగా పాటించాల్సిందేనని, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ నిబంధనలకు లోబడిన దేశం కావడంతో తీర్పుకు లోబడాల్సి ఉంటుందని కెయిర్న్ ఎనర్జీ తన లేఖలో పేర్కొంది. ట్రీటి ఆర్బిట్రేషన్ కేసు తీర్పును అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.

వడ్డీతో సహా చెల్లించాలని
పన్ను వివాదంపై సుదీర్ఘంగా జరిగిన వాదనల్లో కెయిర్న్‌కు వడ్డీ, ఖర్చులు చెల్లించాలని ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు చెప్పింది. న్యూయార్క్ కన్వెన్షన్‌కు భారత్ సంతకం చేసిందని, ఈ నేపథ్యంలో ఆర్బిట్రేషన్ తీర్పును ప్రపంచవ్యాప్త భారతీయ ఆస్తులపై అమలు చేసే అధికారం ఉందని తెలిపింది. ఇందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపింది.
నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌లో భారత్‌కు వ్యతిరేకంగా క్లెయిమ్స్‌ను రిజిస్టర్ చేసింది. త్వరలో కెనడా, అమెరికాలోను చేయనుంది. కోర్టు నుంచి ఉత్తర్వులు పొందడం ద్వారా ఈ దేశాల్లో భారత ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తోంది. రూ.10వేల కోట్లకు పైగా రెట్రోస్పెక్టివ్ పన్ను కేసులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు గత ఏడాది కెయిర్న్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పన్ను బకాయి వసూళ్ల కోసం గతంలో ప్రభుత్వం విక్రయించిన కంపెనీ షేర్లు, జప్తు చేసిన డివిడెండ్స్, నిలిపివేసిన ట్యాక్స్ రీఫండ్స్‌ను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.

రెండేళ్ల క్రితం కానోకో ఫిలిప్స్
2019లో అమెరికాకు చెందిన ఇంధన సంస్థ కానోకో ఫిలిప్స్... వెనిజులా స్టేట్ ఆయిల్ కంపెనీ పీడీవీఎస్ఏ ఆస్తుల కోసం ఇదే తరహా అడుగులు వేసింది. ఆర్బిట్రేషన్‌లో వెనిజులాపై 2 బిలియన్ డాలర్ల కంపన్షేషన్‌ను కేసును గెలిచింది. అప్పుడు వెనిజులా ప్రభుత్వం దిగి వచ్చి సొమ్ము చెల్లించింది.
More From GoodReturns

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications