For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగుతున్న రుణాలు, క్రెడిట్ కార్డ్స్ ఖర్చులు.. కానీ L షేప్ రికవరీ: యాక్సిస్ బ్యాంకు ఎండీ

|

ముంబై: ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడిప్పుడే రుణాలు, క్రెడిట్ కార్డ్స్ డిమాండ్ పెరుగుతోందని యాక్సిస్ బ్యాంకు ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయని, కోలుకోవడానికి మరిన్ని త్రైమాసికాలు పట్టవచ్చునని చెప్పారు. ఆర్థిక పునరుద్ధరణ చాలా నెమ్మదిగా ఉందన్నారు. కానీ మెరుగైన రుణ డిమాండ్ ఆశాజనకంగా ఉందని, క్రెడిట్ కార్డు డిమాండ్ కూడా అలాగే ఉందన్నారు. ప్రభుత్వం నుండి మరో కరోనా ఉద్దీపన ప్యాకేజీతో ముందుకు వస్తుందనేది సందేహమే అన్నారు. పునరుద్ధరణ ఎల్ ఆకారంలో ఉందన్నారు. జూన్ క్వార్టర్‌లో జీడీపీ దారుణంగా పతనమైందని, కానీ ఇప్పుడు క్రమంగా రికవరీ కనిపిస్తోందని తెలిపారు. గత నెలలో వివిధ రంగాలు పుంజుకున్నాయని ఇది క్రమ రికవరీకి సంకేతమన్నారు.

కారు నుండి రైల్వేస్, ట్యాక్స్ వరకు.. భారత్ ఎకనమిక్ రికవరీ!కారు నుండి రైల్వేస్, ట్యాక్స్ వరకు.. భారత్ ఎకనమిక్ రికవరీ!

రుణ గిరాకీ.. క్రెడిట్ కార్డ్స్ ఖర్చు.. ఎల్ షేప్

రుణ గిరాకీ.. క్రెడిట్ కార్డ్స్ ఖర్చు.. ఎల్ షేప్

రుణ గిరాకీ పెరుగుతుండటం, క్రెడిట్ కార్డ్స్ ఖర్చుల జోరు చూస్తుంటే వ్యాపారం విషయంలో ఆశావాదంతో ఉన్నట్లు యాక్సిస్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అమితాబ్ చౌదరి అన్నారు. ఆర్థిక రికవరీ L ఆకారంలో అంటే వృద్ధి నెమ్మదిగా ఉంటుందన్నారు. జీడీపీ జూన్ క్వార్టర్‌లో దాదాపు నాలుగో వంతు క్షీణించడం ఇప్పుడు అందరూ పునరుద్ధరణ సంకేతాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇటీవల వెల్లడైన రికవరీ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో విశ్లేషకులు డిమాండ్ పెరిగి, ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిందని అంచనా వేస్తున్నారన్నారు.

రికవరీ మెరుగు..

రికవరీ మెరుగు..

మొత్తంగా సెప్టెంబర్ నెలలో రికవరీ కొంత మెరుగైందని అర్థమవుతోందని అమితాబ్ చౌదరి అన్నారు. వివిధ సంస్థల సీఈవోలతో మాట్లాడినప్పుడు కూడా వారు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. తమ బ్యాంకుకు వస్తున్న రుణ విచారణలు, క్రెడిట్ కార్డ్స్ వ్యయాలు, అకౌంట్స్ ఓపెనింగ్ పరిస్థితులు చూస్తే రికవరీ మార్పు కనిపిస్తోందన్నారు. అయితే కోలుకోవడానికి మాత్రం సమయం పట్టవచ్చునని తెలిపారు. మనం వాస్తవిక ధోరణితో ముందుకు సాగాలని, ప్రభుత్వం నుండి మరో ప్యాకేజీ కోసం చూడటం కంటే మనం చేయాల్సింది, వ్యాపారాన్ని తిరిగి పెంపొందించుకోవడం చేయాలన్నారు.

గ్రామీణ ప్రాంతం కీలకం..

గ్రామీణ ప్రాంతం కీలకం..

ఎల్ షేప్ రికవరీ కనిపిస్తోందని, పికప్ నెమ్మదిగా ఉంటుందని, దీనికి సమయం పడుతుందని, ఎక్కడో కస్టమర్ విశ్వాసం సడలిపోయిందని, తిరిగి రావడానికి సమయం పడుతుందని అమితాబ్ చౌదరి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిచెందితే ఆర్థిక పునరుజ్జీవ ఆశలు అణిచివేయబడతాయని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. స్వల్పకాలిక లాక్ డౌన్‌లను పక్కన పెట్టాలని, ఇవి ఆర్థిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయన్నారు.

English summary

పెరుగుతున్న రుణాలు, క్రెడిట్ కార్డ్స్ ఖర్చులు.. కానీ L షేప్ రికవరీ: యాక్సిస్ బ్యాంకు ఎండీ | Business optimism returning, economic recovery to be L shaped: Axis Bank MD

Axis Bank's chief executive and managing director Amitabh Chaudhry feels the economic recovery will be slow, but there is optimism coming in from improved loan demand and credit card spends for the third largest private sector lender.
Story first published: Monday, October 5, 2020, 10:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X