For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2021-22: ఈ ఏడాది బడ్జెట్ పత్రాల్లేవు! ఎందుకంటే

|

ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2021 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సెషన్స్ జనవరి 29న ప్రారంభమై, ఫిబ్రవరి 15న ముగుస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8న ప్రారంభమై, ఏప్రిల్ 8న ముగుస్తాయి. సెషన్స్ సమయంలో ఉభయ సభలు ప్రతి రోజు నాలుగు గంటలు ఉంటాయి. బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు చివరి దశకు వచ్చింది. నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌కు సంబంధించి ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా పారిశ్రామివేత్తలు, ఆర్థిక నిపుణులతో భేటీ అయ్యారు.

వేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువవేతనం, నైపుణ్యానికి 'అమెరికా' పట్టం: అమెరికా, చైనా వాళ్లే ఎక్కువ

బడ్జెట్ పత్రాలు ముద్రించడం లేదు

బడ్జెట్ పత్రాలు ముద్రించడం లేదు

ఈసారి బడ్జెట్ గతానికి భిన్నంగా, మునుపెన్నడూ లేనివిధంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ గత నెలలో తెలిపారు. ఇందుకు సంబంధించి మొదటి సంకేతం వచ్చింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం బడ్జెట్ పత్రాలు ముద్రించడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారి ధృవీకరించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరి. బడ్జెట్ పత్రాలు ముద్రించాలంటే ఢిల్లీ, రైసీనా హిల్, నార్త్ బ్లాక్‌లో వారాల కొద్ది ఉండాలి. ఈ ప్రెస్, బోర్డింగ్ లాడ్జింగ్ క్లోజ్ చేశారు. కోవిడ్ కారణంగా దీనిని మూసివేశారు.

అందుకే...

అందుకే...

బడ్జెట్ పత్రాలు ముగిస్తే అంతడితో ఆగిపోదు. అందరూ నార్త్ బ్లాక్‌లో ఉండి బడ్జెట్ పత్రాలు తయారు చేస్తారు. ఆ తర్వాత కార్మికులు వాటిని ట్రక్కులలో తరలించాల్సి ఉంటుంది. పార్లమెంటుకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్లాలి. ఈ బ్యాగ్స్ తొలుత ప్రత్యేక క్లాత్ బ్యాగ్స్‌లో పెట్టి, ఆ తర్వాత ఆకుపచ్చ రంగు వాటిలో కట్టి పార్లమెంటుకు తీసుకు వెళ్తారు. పార్లమెంటు సభ్యులకు పంపిణీ చేసేందుకు కౌంటర్ల వద్దకు తీసుకెళ్తారు. కాపీలు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు పంపించాలి. కరోనా వంటి ఈ సమయంలో ఈ ప్రహసనం కారణంగా బడ్జెట్ పత్రాలు ముద్రించడం లేదు.

బడ్జెట్ పత్రాలు ఇలా లభ్యం

బడ్జెట్ పత్రాలు ఇలా లభ్యం

బడ్జెట్ పత్రాలు 14 డాక్యుమెంట్స్‌తో వివిధ రంగుల్లో ఉంటాయి. బడ్జెట్ ప్రతి ప్రత్యేక డిజైన్ కలిగి ఉంటుంది. బడ్జెట్ పత్రాల పైన ఎరుపురంగు బ్యాండ్, కింద ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. ఈసారి బడ్జెట్ పత్రాలు ముద్రించకపోవడం వల్ల 750 మంది పార్లమెంటు సభ్యులకు ఈ-వెర్షన్ ద్వారా అందిస్తారు. మీడియాకు ఫిజికల్ డాక్యుమెంట్స్ సరఫరా ఇప్పటికే నిలిచిపోయింది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం www.Indiabudget.gov.in లేదా www.indiabudget.nic.in లో చూడవచ్చు.

English summary

Budget 2021-22: ఈ ఏడాది బడ్జెట్ పత్రాల్లేవు! ఎందుకంటే | Budget documents will not be printed this year

Finance Minister Nirmala Sitharaman last month promised ‘Budget like never before’ and now the first indication is already out here. Budget documents will not be printed this year.
Story first published: Monday, January 11, 2021, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X