For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2021: బ్యాడ్ బ్యాంకుకు నిర్మలమ్మ ఓకే, బ్యాంకులకు రూ.20వేలకోట్లు

|

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు తెరలేపారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్పీఏలు, మొండి బకాయిలు బ్యాడ్ బ్యాంకుకు తరలించనున్నట్లు తెలిపారు. బ్యాంకుల ఖాతాలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బ్యాంకు రీక్యాపిటలైజేషన్ కోసం రూ.20వేలకోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

బ్యాడ్ బ్యాంకు అంశంపై గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది. బ్యాంకులకు ఎన్పీఏలు, మొండి బకాయిలు పెరుగుతున్నందున బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని పలువురు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Budget 2021: Rs 20,000 crore for bank recapitalisation, proposes Bad Bank for NPAs

కాగా, ఈ బడ్జెట్‌లో స్టార్టప్స్‌కు ప్రోత్సాహకాలు ప్రకటించారు. స్టార్టప్స్‌కు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతమిస్తున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయంలో 180 నుంచి 120 రోజులు కుదిస్తున్నట్లు తెలిపారు.

English summary

Budget 2021: బ్యాడ్ బ్యాంకుకు నిర్మలమ్మ ఓకే, బ్యాంకులకు రూ.20వేలకోట్లు | Budget 2021: Rs 20,000 crore for bank recapitalisation, proposes Bad Bank for NPAs

Taking the recapitalisation of banks forward, the FM has proposed Rs 20,000 crore for shoring up the capital of PSBs in order to cope with the bad loans that are expected to go up in the post-pandemic phase.
Story first published: Monday, February 1, 2021, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X