న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టారంటే ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయనే ఉత్కంఠ సహజం. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేశారు. వ్యవసాయ రంగం సహా వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్ నేపథ్యంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరిన్ని పెరుగుతాయి.. అవేమిటంటే...

కస్టమ్స్ డ్యూటీ పెంపు.
వాల్ ఫ్యాన్స్ పైన కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు టేబుల్‌వేర్, కిచెన్‌వేర్ దిగుమతి సుంకాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో వీటి ధరలు కూడా పెరుగుతాయి.

మినహాయింపుల ఉపసంహరణతో ధరల పెరుగుదుల
రాషుగర్, ఆగ్రో అనిమల్ ఆధారిత ఉత్పత్తులు, తునా బెయిట్, స్కిమ్డ్ మిల్క్, కొన్ని అల్కాహాలిక్ బీవరేజెస్, సోయా ఫైబ్, సోయా ప్రొటీన్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో వీటి ధరలు కూడా పెరగనున్నాయి.

7.5 శాతం నుంచి 20 శాతానికి
వాల్ ఫ్యాన్స్ పైన కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతం నుంచి 20 శాతానికి భారీగా పెంచారు. టేబుల్ వేర్, కిచెన్ వేర్ పైన కూడా అదే స్థాయిలో పెంచారు. పింగాణి లేదా చైనా సిరామిక్, క్లే ఐరన్, స్టీల్, రాగితో తయారు చేసిన వాటిపై 20 శాతం పెరుగుతుంది.

ఈ సుంకం రద్దు
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను మినహాయించి ఇతర కమర్షియల్ వెహికిల్ పార్ట్స్, ఉత్ప్రేరక కన్వర్టర్లు కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించారు. అధిక పనితీరు గల బహుళార్ధక సాధక ప్లాస్టిక్ ఉత్పత్తిలో ఉపయోగించే పీటీఏపై యాంటీ డంపింగ్ సుంకం రద్దు చేశారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications