For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'బడ్జెట్ బాగుంది, టెల్కోలకు ఊరట: కాదు.. కాదు ఉపశమనం లేదు'

|

నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన రాజకీయ నాయకులు, పలువురు పారిశ్రామికవేత్తలు స్పందించారు. మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారని చెబుతు పలువురు ప్రశంసిస్తుండగా, తమ రంగానికి కేటాయింపులు ఏవని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత

ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందని, ఇది సంతోషకరమని ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందర్ షా అన్నారు. వైద్య రంగానికి ఊతం, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఇది చాలా సంతృప్తికరమైన బడ్జెట్ అన్నారు.

వేతనజీవుల కొనుగోలు తగ్గిస్తారా? ఇన్సురెన్స్ స్టాక్స్‌కు ఆదాయపు పన్ను దెబ్బవేతనజీవుల కొనుగోలు తగ్గిస్తారా? ఇన్సురెన్స్ స్టాక్స్‌కు ఆదాయపు పన్ను దెబ్బ

Budget 2020: industrialist reaction on budget

మాకు ఉపశమనం ఏది

సంక్షోభంలో ఉన్న టెలికాం పరిశ్రమకు బడ్జెట్లో ఎలాంటి ఉపశమనం లేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా టెలికాం రంగాన్ని చేర్చక పోవడం అసంతృప్తిని కలిగించిందన్నారు. రూ.1.47 లక్షల కోట్ల AGR బకాయి భారంతో ఇబ్బందులు పడుతున్న టెలికాం రంగానికి ఉపశమనం లభిస్తుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందన్నారు.అయితే బడ్జెట్‌లో టెలికం ఎక్విప్‌మెంట్స్‌పై కస్టమ్ డ్యూటీని తగ్గించారు. దీనిని పలువురు స్వాగతిస్తున్నారు. టెలికం పరికరాలపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం సానుకూల చర్య అంటున్నారు.

English summary

'బడ్జెట్ బాగుంది, టెల్కోలకు ఊరట: కాదు.. కాదు ఉపశమనం లేదు' | Budget 2020: industrialist reaction on budget

Finance Minister Nirmala Sitharaman has reduced the import duty on telecom equipment, which is believed to be a positive move for telcos.
Story first published: Saturday, February 1, 2020, 19:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X