For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబైల్ ఫోన్స్ ఎగుమతిపై 2 శాతం ప్రోత్సాహకంపై ఆశలు

|

దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు సెల్‌ఫోన్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా బడ్జెట్‌లో ప్రకటనలు ఉండాలని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఎగుమతులకు ప్రోత్సాహకాలు కొనసాగించాలని, కొన్ని విడి భాగాల దిగుమతులపై సుంకాన్ని పెంచాలని, సెల్‌ఫోన్ తయారీ కంటే విడి భాగాలపై అధిక జీఎస్టీ ఉందని, దీనిని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తోంది.

బడ్జెట్ పైన మరిన్ని కథనాలు

4 శాతం ప్రోత్సాహం కొనసాగించండి

4 శాతం ప్రోత్సాహం కొనసాగించండి

ఎగుమతుల ప్రోత్సాహానికి అమలు చేస్తున్న MSEI స్థానంలో WTO నిబంధనల మేరకు కొత్త నిబంధనని అమల్లోకి తెచ్చే వరకు సెల్‌ఫోన్ ఎగుమతులపై నాలుగు శాతం ప్రోత్సాహకాన్ని కొనసాగించాలని చెబుతోంది. ఇటీవల తొలగించిన 2శాతం ప్రోత్సాహకాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. ఈ బడ్జెట్‌లో ఈ ఊరట ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. తయారీ చేసే సంస్థలకు కార్పోరేట్ పన్నును పది శాతానికి పరిమితం చేయాలని కోరుతున్నారు.

ఎక్స్‌పోర్ట్ రిటర్న్స్ పెంచాలి

ఎక్స్‌పోర్ట్ రిటర్న్స్ పెంచాలి

దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై చెల్లించిన కస్టమ్స్‌లో ఎక్స్‌పోర్టర్స్ రూ.197 వాపసు పొందవచ్చునని, పెరిగిన ధరల నేపథ్యంలో దీనిని మరింత పెంచాలని కోరుతోంది. మొబైల్ తయారీ సంస్థల కోసం అత్యవసర నిధి కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం ఉన్నప్పటికీ గరిష్ట సుంకాన్ని కొంత మేరకు పరిమితం చేయాలని కోరుతున్నారు.

సుంకం తగ్గించండి

సుంకం తగ్గించండి

సెల్‌ఫోన్లకు 12 శాతం జీఎస్టీ ఉందని, కానీ విడిభాగాలపై 18 శాతం, 28 శాతంగా ఉందని అన్నింటిపై 12 శాతంగా ఉండాలని కోరుకుంటున్నారు. లిథియం అయాన్ సెల్స్ పైన సుంకాన్ని తగ్గించాలని, అలాగే ఛార్జర్లు, కంప్రెషర్లు, సెట్ టాప్ బాక్స్ ఛార్జర్లు వంటి వాటిపై దిగుతి సుంకాన్ని పెంచితే అప్పడు మేకిన్ ఇండియా సులభమవుందంటున్నారు.

English summary

మొబైల్ ఫోన్స్ ఎగుమతిపై 2 శాతం ప్రోత్సాహకంపై ఆశలు | Budget 2020: Govt likely to restore 2% additional duty incentive on mobile phones export

The government is likely to restore 2 percent additional duty incentive on mobile phones export with effect from January 1, a source said. This duty benefit, which will help boost exports, is expected to continue till March 31, 2020.
Story first published: Thursday, January 30, 2020, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X