For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget Good News: గృహ నిర్మాణాలపై రూ.1.5 లక్షల అదనపు ప్రయోజనం పొడిగింపు

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో రియల్ వ్యాపారులకు ఊరట కల్పించారు. ఈ బడ్జెట్లో ఎన్నో ఊరటలు కల్పించారు. రియల్ వ్యాపారులకు ఏడాది పాటు ట్యాక్స్ హాలీడే ప్రకటించారు. కంపెనీలపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను రద్దు చేశారు. రూ.5 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు ఆడిటింగ్ నుండి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు ఎన్నారైలకు అవకాశం కల్పించారు.

Budget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదాBudget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదా

అదనపు నిధుల కోసం కొత్త పథకం

అదనపు నిధుల కోసం కొత్త పథకం

ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్ల మూలధనాన్ని సాయం చేయనున్నట్లు తెలిపారు. డిపాజిటర్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు. కంపెనీ చట్టంలో మార్పులు చేస్తామని తెలిపారు. బ్యాంకింగేతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు అదనపు నిధుల కేటాయింపుకు కొత్త పథకం తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎన్నారైలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక ఒప్పందాల పర్యవేక్షణకు కొత్త చట్టం తెస్తున్నట్లు చెప్పారు.

పన్ను ప్రయోజనం పొడిగింపు

పన్ను ప్రయోజనం పొడిగింపు

రియల్ ఎస్టేట్ బూమింగ్ కోసం బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. గృహ నిర్మాణాలపై అదనంగా రూ.1.5 లక్షల పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నారు. రుణాలపై చెల్లించే వడ్డీపై అదనపు రూ.1.5 లక్షల పన్ను ప్రయోజనాలను మార్చి 2021 వరకు పొడిగించింది.

271 మంది పేదరికం నుంచి బయటపడ్డారు

271 మంది పేదరికం నుంచి బయటపడ్డారు

2006-2016 మధ్య దాదాపు 271 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రుణం మార్చి 2019 నాటికి 48.7 శాతానికి తగ్గిందని తెలిపారు. 2014 మార్చిలో ఇది 52.2 శాతంగా ఉంది. భారత్ ప్రస్తుతం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని చెప్పారు. 2020-21లో రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

English summary

Budget Good News: గృహ నిర్మాణాలపై రూ.1.5 లక్షల అదనపు ప్రయోజనం పొడిగింపు | Budget 2020: FM makes housing more affordable, gives tax holiday to affordable housing developers

Finance Minister Nirmala Sitharaman makes housing more affordable, gives tax holiday to affordable housing developers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X