న్యూఢిల్లీ: బ్యాంకులలో డబ్బులు పొదుపు చేసే వారికి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో భారీ ఊరట కల్పించారు. బ్యాంకులలో దాచుకునే మొత్తానికి మరింత భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది మధ్య తరగతి ప్రజలకు శుభవార్తగా చెప్పారు. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీ ఇప్పటి వరకు రూ.1 లక్షగా ఉంది. దీనిని ఐదు రెట్లు పెంచుతూ సామాన్యులకు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు.

రూ.5 లక్షల వరకు ఇన్సురెన్స్
డిపాజిటర్ల ఇన్సురెన్స్ కవరేజీని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఏడాది పీఎంసీ బ్యాంకు స్కాం నేపథ్యంలో ఈ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దీనిని రూ.2 లక్షలు లేదా రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినిపించాయి. ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ఇది సామాన్యులకు ఊరట కలిగించే అంశం.

వారికి భారీ ఊరట
ఈ నిర్ణయం సహకార బ్యాంకులను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్బీఐ సవరణలపై కసరత్తు చేస్తోందని తెలిపారు. ఆర్బీఐ స్తంభింప చేసిన బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్న వారికి ఇది పెద్ద శుభవార్త. ఇదివరకు రూ.1 లక్షగా ఉన్న దానిని రూ.5 లక్షలకు పెంచడం ఎంతో ఊరట కలిగించే అంశం.

కంగారు అవసరం లేదు
అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని, ప్రజలు ఈ విషయమై కంగారు పడవలసిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. దీంతో పాటు ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీని స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు.

బీమా కవరేజీ
డీఐసీజీసీ చట్టం 1961లోని సెక్షన్ 16(1) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు విఫలమై, నష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఆ బ్యాంకుల్లోని ఖాతాదారుల డిపాజిట్లపై బీమా కవరేజీ ఉంటుంది. ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (డీఐసీజీసీ) ఈ బీమాను అందిస్తోంది.

వీటన్నింటికి వర్తింపు
ఖాతాదారుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండానే బ్యాంకులు చెల్లించే ప్రీమియంతో డిపాజిటర్లకు నిర్దేశించిన గరిష్ట మొత్తం వరకు ఇన్సురెన్స్ కవర్ ఉంటుంది. దీనిని ఇప్పుడు ఐదు రెట్లు పెంచి రూ.5 లక్షలుగా చేశారు. సేవింగ్స్, కరెంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లకు, రికరింగ్ డిపాజిట్లకు ఈ బీమా వర్తిస్తుంది.
More From GoodReturns

ఇకపై మీ వడ్డీపై TDS కోత! కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవే!

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications