For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FY19 భారీ లాభాలు-నష్టాల్లోని టాప్ 3 కంపెనీలివే, కేంద్ర ఖజానాకు వచ్చే వాటా ఎంతంటే?

|

2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ONGC, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఎన్టీపీసీ.. ఈ మూడు కంపెనీలు భారీగా లాభాలు ఆర్జించాయి. అదే సమయంలో BSNL, MTNL, ఎయిరిండియాలు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సోమవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదిక ప్రకారం ఈ మూడు కంపెనీలు వరుసగా మూడో ఆర్థిక సంవత్సరం నష్టాలను చవిచూశాయి.

ప్లాంట్ల మూసివేత: భారత్ ఆటోకు కరోనా భయం, BS-6 పొడిగింపు ఉంటుందా?ప్లాంట్ల మూసివేత: భారత్ ఆటోకు కరోనా భయం, BS-6 పొడిగింపు ఉంటుందా?

భారీ నష్టాలు

భారీ నష్టాలు

అన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (PSU)లకు సంబంధించి యాన్యువల్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్‌ను వెల్లడించే పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సర్వే 2018-19లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 10 కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఈ కంపెనీల నష్టాలే భారీగా ఉన్నాయి. మొత్తం నష్టాల్లో ఈ టాప్ పది కంపెనీలదే 94.04 శాతంగా ఉంది.

టాప్ 3 కంపెనీలు

టాప్ 3 కంపెనీలు

ప్రాఫిట్‌లో ఉన్న టాప్ 3 కంపెనీల్లో ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పోరేషన్ (ONGC), ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఎన్టీపీసీలు ఉన్నాయి. వీటి లాభాలు వరుసగా 15.3 శాతం, 9.68 శాతం, 6.73 శాతం ఉన్నాయి.

గత ఏడాది నష్టం

గత ఏడాది నష్టం

స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఎంఎస్‌టీసీ, చెన్నై పెట్రోలియం కార్పోరేషన్‌లు 2017-18లో లాభాలను చవి చూసినప్పటికీ, 2018-19లో మాత్రం నష్టపోయాయి.

భారీగా పెరిగిన ఆదాయం

భారీగా పెరిగిన ఆదాయం

2018-19లో అన్ని సెంటర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ (CPSEs)ల ఆదాయం రూ.24,40,748 కోట్లుగా ఉంది. 2017-18లో ఇది రూ.20,32,001 కోట్లుగా ఉంది. అంటే అన్ని CPSEsల ఆదాయం 20.12 శాతం పెరిగింది.

కేంద్ర ఖజానాకు CPSEs వాటా

కేంద్ర ఖజానాకు CPSEs వాటా

కేంద్రం ఖజానాకు CPSEsల సహకారం విషయానికి వస్తే 2018-19లో రూ.3,68,803 కోట్లుగా ఉంది. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, కార్పోరేట్ ట్యాక్స్, కేంద్ర ప్రభుత్వ రుణాలపై వడ్డీ, డివిడెండ్ ఇతర పన్నులు కలిపి పై మొత్తం ఉంది. 2017-18లో మాత్రం రూ.3,52,361 కోట్లుగా ఉంది. అంటే 4.67 శాతం పెరిగింది.

English summary

FY19 భారీ లాభాలు-నష్టాల్లోని టాప్ 3 కంపెనీలివే, కేంద్ర ఖజానాకు వచ్చే వాటా ఎంతంటే? | BSNL, Air India, MTNL highest loss making PSUs and ONGC most profitable

ONGC, Indian Oil Corporation and NTPC were the top three profitable PSUs in 2018-19, whereas BSNL, Air India and MTNL incurred highest losses for a third consecutive year, according to a survey tabled in Parliament on Monday.
Story first published: Tuesday, February 11, 2020, 11:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X