For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.5 బిస్కట్ కూడా కొనడం లేదా?: బ్రిటానియా లాభం రూ.403 కోట్లు

|

బెంగళూరు: ఇటీవల ఆటోమొబైల్ రంగంతో పాటు ఎఫ్ఎంసీజీ కూడా మందగమనం కనిపించింది. కనీసం రూ.5 బిస్కట్ ప్యాకెట్ కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని ఇటీవల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రూ.5 పార్లే బిస్కట్ లేదా బ్రిటానియా బిస్కట్‌లు కూడా కొనుగోలు చేయడం లేదని, ఆటో, ఎఫ్ఎంసీజీలకు డిమాండ్ బాగా తగ్గిందని, చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వచ్చాయని సంబంధిత పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

అయితే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్దీపన చర్యలు లేదా పండుగలు లేదా మరో కారణం కావొచ్చు... కానీ ఆయా పరిశ్రమలు కుదురుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ పెరిగాయి. తాజాగా, రూ.5 బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉందని ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో బ్రిటానియా ఇండస్ట్రీస్ మూడో క్వార్టర్లో భారీ లాభాలు నమోదు చేసింది.

భారత మార్కెట్‌ను దెబ్బకొట్టిన బిస్కట్, పెరిగిన కుకీస్ </a><a class=" width="90" height="50" title="భారత మార్కెట్‌ను దెబ్బకొట్టిన బిస్కట్, పెరిగిన కుకీస్ " />భారత మార్కెట్‌ను దెబ్బకొట్టిన బిస్కట్, పెరిగిన కుకీస్

33 శాతం పెరిగిన బ్రిటానియా లాభాలు

33 శాతం పెరిగిన బ్రిటానియా లాభాలు

బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.403 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.303.3 కోట్లతో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించినట్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. నికర అమ్మకాలు రూ. 2,913.55 కోట్ల నుంచి 6.98% వృద్ధి నమోదు చేసి రూ.3,116.99 కోట్లకు పెరిగినట్లు కంపనీ ఎండీ వరుణ్ బెర్రీ తెలిపారు.

తగ్గిన ఖర్చులు..

తగ్గిన ఖర్చులు..

బ్రిటానియా మొత్తం ట్యాక్స్ ఖర్చులు రెండో క్వార్టర్‌లో రూ.95.51 కోట్లకు తగ్గాయి. బ్రిటానియా ఆర్థిక ఖర్చులు జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 6 రెట్లు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో ఈ ఖర్చు రూ.2.42 కోట్లు కాగా, ఇప్పుడు రూ.16.14 కోట్లకు చేరుకుంది. మొత్తం ఖర్చులు 6.64 శాతం పెరిగి రూ.2,454.58 నుంచి రూ.2,617.64కు చేరుకున్నాయి.

సీక్వెన్షియల్‌గా ఆదాయం 13 శాతం పెరిగింది..

సీక్వెన్షియల్‌గా ఆదాయం 13 శాతం పెరిగింది..

బేసిక్ ఎర్నింగ్స్ పర్ షేర్ 2018 సెప్టెంబర్ 30 న రూ.12.61 కాగా, 2019 సెప్టెంబర్ 30వ తేదీన రూ.16.82కి పెరిగింది. ఫారన్ కరెన్సీ ట్రాన్స్‌లేషన్ రిజర్వ్ పరంగా ఈ క్వార్టర్లో రూ.2.8 కోట్లు రాగా, గత ఏడాది ఇదే సమయంలో రూ.6.54 కోట్లుగా ఉంది. మార్కెట్ కంటే వేగంగా వృద్ధి సాధించడాన్ని కొనసాగిస్తున్నామని వరుణ్ బెర్రీ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 13 శాతం పెరిగిందన్నారు. ముడి చమురు ధరలు పెద్దగా పెరగకపోవడంతో వ్యయాలు పెద్దగా పెరగలేదన్నారు.

బ్రిటానియా షేర్ ధర..

బ్రిటానియా షేర్ ధర..

బ్రిటానియా షేర్ ప్రైస్ సోమవారం 1.04 శాతం తగ్గి రూ.3,125 వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు 23 శాతం కోల్పోయిన బ్రిటానియా షేర్ ఆగస్ట్ 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు 30.73 శాతం పెరిగింది. బ్రిటానియా గుడ్ డే, టైగర్ బిస్కట్లను తయారు చేస్తోంది.

English summary

రూ.5 బిస్కట్ కూడా కొనడం లేదా?: బ్రిటానియా లాభం రూ.403 కోట్లు | Britannia Q2 profit surges 74% to Rs 493 crore

Britannia Industries on Monday posted a 74% increase in net profit to Rs 492.58 crore for the second-quarter ended September, driven by premium products and cost efficiency programme.
Story first published: Tuesday, November 12, 2019, 11:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X