For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BPCL కొనుగోలుకు ముందుకు రాని ముఖేష్ అంబానీ, సౌదీ ఆరామ్‌కో

|

భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL) వాటా కొనుగోలు రేసు నుండి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో తప్పుకున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం ఈ ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలో వాటాలు విక్రయించేందుకు సిద్ధమైంది. ఇందుకు కేంద్రం మూడు నుండి నాలుగు బిడ్స్ అందినట్లుగా తెలుస్తోంది.

ఈ బిడ్స్‌లో రిలయన్స్, విదేశీ చమురు దిగ్గజాలు సౌదీ ఆరామ్‌కో, బ్రిటిష్ పెట్రోలియమ్, టోటల్ బిడ్స్ లేవు. ఆసక్తి ఉన్న సంస్థల నుండి బిడ్స్ అందుకున్నట్లు లావాదేవీ అడ్వైజర్లు చెప్పినట్లు డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్‌మెంట్ తెలిపింది. అడ్వైజర్ల పరిశీలన అనంతరం ట్రాన్సాక్షన్ రెండో దశలోకి వెళ్తుంది. బిడ్స్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది.

గుడ్‌న్యూస్! NPSలో అందరికీ పన్ను మినహాయింపు, కేంద్రానికి సిఫార్సుగుడ్‌న్యూస్! NPSలో అందరికీ పన్ను మినహాయింపు, కేంద్రానికి సిఫార్సు

BPCL stake sale gets multiple bids, RIL skip race

బీపీసీఎల్‌లో కేంద్రం వాటా 52.98 శాతం వాటాను విక్రయిస్తోంది. దీని ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ రూ.47,430 కోట్లు. దేశవ్యాప్తంగా 17 వేలకు పైగా పెట్రోల్ బంకులు, 6వేలకు పైగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీలు, 61 విమానయాన ఇంధన స్టేషన్లు ఉన్నాయి. కాగా, మూడు నుండి నాలుగు బిడ్స్ దాఖలైన నేపథ్యంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ స్క్రూటిని అనంతరం రెండో దశలోకి వెళ్తుంది. ఇందుకు రెండు నుండి మూడు వారాల సమయం పట్టవచ్చు.

English summary

BPCL కొనుగోలుకు ముందుకు రాని ముఖేష్ అంబానీ, సౌదీ ఆరామ్‌కో | BPCL stake sale gets multiple bids, RIL skip race

Global and domestic companies submitted expressions of interest (EoI) for the government’s stake in Bharat Petroleum Corp Ltd by the Monday deadline, said people with knowledge of the matter.
Story first published: Tuesday, November 17, 2020, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X